అడిలైడ్: భారత్ ఆస్టేలియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్. ఈ సిరిస్ మొదటి నుండి కూడా ఆస్టేలియా ఆధిక్యం చూపించి మూడు టెస్టు మ్యాచ్‌లలో విజడయం సాధించి సిరిస్‌ని కైవసం చేసుకుంది. ఏదో నామమాత్రంగా సాగుతున్న నాల్గవ టెస్టులో కూడా ఆస్టేలియా విజయం దాదాపుగా ఖరారైపోయినట్లు కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనం ఆస్టేలియా రెండో ఇన్నింగ్స్‌ని 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులకు డిక్లేర్ చేసింది.
భారత్ ఆస్టేలియా నాల్గవ టెస్టు మ్యాచ్ లైవ్ స్కోరు కార్డు
దీంతో 500 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన టీమిండియా టీ విరామానికి ముందు 2 వికెట్లను కోల్పోయి 92 పరుగులు చేసింది. 14 పరుగుల వద్ద ఓపెనర్ గంభీర్ వికెట్‌ని కోల్పోయిన టీమిండియాను మరో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(62) అర్ద సెంచరీతో ఆదుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రికెట్ దేవడు సచిన్(13), ద వాల్ ద్రవిడ్(25) పరుగులతో పెవిలియన్‌కు చేరుకున్నారు.
ఇక నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లను కోల్పోయి 166 పరుగులు చేసింది. టీమిండియా నాల్గవ టెస్టులో గెలవాలంటే మిగిలిన ఒకే ఒక్క రోజులో తన చేతిలో ఉన్న నాలుగు వికెట్లతో 334 పరుగులు చేయాల్సి ఉంటుంది. భారత్ టాప్ బ్యాట్స్‌మెన్‌లలో లక్ష్మణ్ 33 పరుగులు చేయగా.. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన యువ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 22 పరుగుల వద్ద రనౌటయ్యాడు. దీంతో ఆస్టేలియా సిరిస్ మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసేందుకు అంతా రంగం సిద్దం చేసుకుంది.