ధోనీపై ఓ మ్యాచ్ నిషేధం: స్లో ఓవర్ రేట్ ఫలితం

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 9:57 [IST]
MS Dhoni
బ్రిస్పేన్: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఓ మ్యాచ్ నిషేధం పడింది. ఈ మ్యాచులో భారత బౌలర్లు నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేశారు. దీంతో ధోనీపై ఓ మ్యాచు నిషేధం విధించడంతో పాటు మ్యాచు ఫీజులో 40 శాతం కోత విధించారు. ఇతర భారత ఆటగాళ్ల ఫీజుల్లో 20 శాతం కోత పెట్టారు. దీంతో మంగళవారం శ్రీలంకతో జరిగే వన్డే మ్యాచుకు ధోనీ దూరంగా ఉంటాడు.

టాప్ - 3 బ్యాట్స్‌మెన్‌కు రొటేషన్ పద్ధతిని అమలు చేస్తుండడాన్ని ధోనీ సమర్థించుకున్నాడు. రోటేషన్ పాలసీ సబబేనని అతను అన్నాడు. వాళ్లు మైదానంలో నెమ్మదిగా కదులుతున్నారని అతను చెప్పాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్‌లతో పాటు కొందరు ఇతర ఆటగాళ్లదీ ఇదే పరిస్థితి అని, దీంతో ఫీల్డింగ్‌పై ప్రభావం పడుతోందని అతను అన్నాడు.
English summary
MS Dhoni has been suspended for one ODI and India fined for the team's second over-rate breach in ODIs in less than a year.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST