సచిన్ మరిచిపోవాలని శాస్త్రి: తప్పుకోవాలని కపిల్

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 10:11 [IST]
Ravi Shastri
బ్రిస్పేన్: సచిన్ టెండూల్కర్ తాను చేరుకోవాల్సిన మైలురాయిని మరిచిపోవాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి సూచించారు. వందో అంతర్జాతీయ శతకం కోసం నిరీక్షణ కొనసాగుతుందని, అయితే దాన్ని మరిచిపోయి టెండూల్కర్ ఆడాలని ఆయన సూచించారు. సచిన్ టెండూల్కర్ ఆట నుంచి తప్పుకుంటే మంచిదని భారత క్రికెట్ జట్టు మరో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సూచించారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత సచిన్ టెండూల్కర్ రిటైర్మైంట్ ప్రకటించాల్సి ఉండిందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, సచిన్ టెండూల్కర్ తాను వందో శతకం చేయాలనే విషయాన్ని మరిచిపోయి బౌలర్లపై ఎదురుదాడికి దిగాలని రవిశాస్త్రి సూచించారు. రవిశాస్త్రి సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రికతో మాట్లాడారు. టెంపోను కొనసాగిస్తూ వందో శతకం చేయాలనే విషయం మరిచిపోతే సచిన్ టెండూల్కర్ గాడిలో పడతాడని ఆయన అన్నారు. తమ కాలంలో సెంచరీ సాధించడాన్నే అభిమానులు గొప్పగా చెప్పుకునేవారని, ఇది వందో శతకం, జోక్ కాదని ఆయన అన్నారు.
English summary
former India skipper Ravi Shastri wants senior batsman Sachin Tendulkar to stay true to his game and "forget about the milestone" as the wait for his landmark 100th international century continues.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST