సచిన్ దుస్థితి: తలకు తాకిన బ్రెట్‌లీ బంతి

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 11:51 [IST]
 Sachin Tendulkar
బ్రిస్పేన్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పరిస్థితి దారుణంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అతను పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. బౌలర్లకు చుక్కులు చూపించిన సచిన్ టెండూల్కర్ ఇప్పుడు అతి సాధారణమైన ఆటగాడి కన్నా పేలవంగా ఆడుతున్నారు. పైగా, దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అతని కాన్‌స్టేషన్ పూర్తిగా దెబ్బ తిన్నట్లు కనిపిస్తోంది.

ఆదివారం జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా పేసర్ బ్రెట్‌లీ వేసిన బంతి టెండూల్కర్ తలకు తగిలింది. బ్రెట్‌లీ వేసిన బంతికి తగిన సమయంలో అతను జవాబు చెప్పలేకపోయాడు. దీంతో బంతి ముందు జాగ్రత్తగా ఎంఆర్ఐ స్కాన్ తీయించుకునే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. బ్రెట్‌లీ రెండో ఓవరు చివరి బంతి పేస్‌ను అంచనా వేయలేకపోవడంతో అది అతని హెల్మెట్ గ్రిల్‌కు తగిలింది. దానివల్ల సచిన్ టెండూల్కర్ నుదటికి దెబ్బ తగిలినట్లు అనుమానిస్తున్నారు.

అతను బ్యాటింగును కొనసాగించాడు. అయితే ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే అతను అవుటయ్యాడు. డ్రెసింగ్ రూంలో సచిన్ టెండూల్కర్‌కు ఐస్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. నుదురు ఉబ్బినట్లు చెబుతున్నారు. పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ ఎంఆర్ఐ స్కాన్‌కు వైద్యులు సలహా ఇచ్చారు. భారత జట్టులోని రాజకీయాలు, రోటేషన్ పద్ధతి వల్ల పక్కన కూర్చోవాల్సి రావడం, వందో శతకం చేయాలనే ఒత్తిడి సచిన్ టెండూల్కర్‌ను ఈ స్థితికి తెచ్చినట్లు చెబుతున్నారు.
English summary
Tendulkar is likely to go for a precautionary MRI scan today after he was hit on his head by a sharply lifting delivery from Brett Lee while batting in the tri-series match against Australia here
User Comments
Gopala krishna 24 Feb 2012 05:34 pm
shut up Gangulu
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST