బ్రిస్బేన్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన వన్డే మ్యాచులో భారత్‌పై శ్రీలంక పగ తీర్చుకుంది. భారత్‌ను 51 పరుగుల తేడాతో ఓడించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసిన శ్రీలంక ఆ తర్వాత బౌలింగులో తన సత్తా చాటి భారత్‌ను 238 పరుగులకే ఆలవుట్ చేసింది. దీంతో ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక తన ఆశలను మరింత సజీవంగా మార్చుకుంది. భారత్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 20వ అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 45.1 ఓవర్లలో భారత్ ఆలవుట్ అయింది. కోహ్లీ 66 పరుగులు చేయగా, ఇర్ఫాన్ పఠాన్ 47 పరుగులు చేశాడు. పెరెరా నాలుగు వికెట్లు, కులశేఖర మూడు వికెట్లు, మలింగ రెండు వికెట్లు తీసుకున్నారు. మహరూఫ్‌కు ఒక్క వికెట్ లభించింది.
శ్రీలంక నిర్దేశించిన 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ పూర్తిగా చతికలపడింది. మొదటి ఓవరు రెండో బంతికే వీరేంద్ర సెహ్వాగ్ వెనుదిరిగాడు. సచిన్ టెండూల్కర్ మళ్లీ నిరాశపరిచాడు. 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను అవుటయ్యాడు. భారత్‌పై శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఓపెనర్లు ధాటిగా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత వరుసగా రెండు వికెట్లు పడ్డాయి. దిల్షాన్, జయవర్ధనే బ్యాటింగ్‌కు దిగారు. 14 ఓవర్లలో 75 పరుగులు చేశారు. అయితే ఆ తర్వాత 45 పరుగులు చేసి జయవర్ధనే, 51 పరుగులు చేసి దిల్షాన్ అవుటయ్యారు. అయితే, ఆ తర్వాత శ్రీలంక నింపాదిగా, ధాటికి ఆడి భారత్ మీద పైచేయి సాధించింది.
మహేంద్ర సింగ్ ధోనీపై మ్యాచు నిషేధం విధించడంతో భారత జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ నాయకత్వం వహిస్తున్నాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచులో ఆడడం లేదు. పార్ధివ్ పటేల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. జహీర్ ఖాన్‌ను పక్కకు పెట్టి స్పిన్నర్ అశ్విన్‌ను మైదానంలోకి దించారు. గత మ్యాచులో స్వల్పంగా గాయపడిన సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచులో ఆడుతున్నాడు. భారత్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. ధోనీ, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ స్థానాల్లో పార్థివ్ పటేల్, అశ్విన్, సెహ్వాగ్ మైదానంలోకి దిగారు. శ్రీలంక జట్టులో ఏ విధమైన మార్పులు జరగలేదు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో పది పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. శ్రీలంక ఏడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది.
జట్లు
ఇండియా: వీరేందర్ సెహ్వాగ్ (కెప్టెన్), గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, వినయ్ కుమార్, పార్థివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్
శ్రీలంక: మహేలా జయవర్ధనే (కెప్టెన్), అంజిలో మాథ్యూస్, తిలకరత్నే దిల్షాన్, కుమార్ సంగక్కర, దినేష్ చండిమాల్, లహిరు తిరిమానే, తిషారా పెరెరా, ఫర్వేజ్ మహరూఫ్, రంగన హెరాత్, లాసిత్ మలింగ, నువాన్ కులశేఖర