మహేంద్ర సింగ్ ధోనీపై విరుచుకుపడిన గంగూలీ

మంగళవారం, ఫిబ్రవరి 21, 2012, 16:56 [IST]
Sourav Ganguly
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రొటేషన్ పాలసీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విరుచుకుపడ్డారు. ఉత్తమ ఫీల్డింగ్ ప్రమాణాల కోసం సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ఆటగాళ్లకు రొటేషన్ పాలసినీ అమలు చేస్తున్నట్నలు ధోనీ చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. జట్టులోని 11 ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో అత్యద్భుతమైన ప్రదర్శన కనబరచడమనేది జరగదని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా జట్టు కూడా అలా లేదని ఆయన అన్నారు. ఫిల్డింగ్ మరీ మరీ ముఖ్యమే అయినప్పటికీ క్లిష్టమైన పరిస్థితిలో పరుగులు సాధించడం అంతకన్నా ముఖ్యమని ఆయన అన్నారు. ధోనీ తన పద్ధతి మార్చుకోవాలని ఆయన అన్నారు.

ఎక్కువ కాలం ఫలితాలు సాధించని ఆటగాళ్లను సమర్థించడాన్ని ధోనీ మానుకోవాలని ఆయన సూచించారు. తన మైండ్ సెట్ వల్ల ఎవరో ఒక్కరిని కాపాడుతూ పోవడం సరి కాదని ఆయన అన్నారు. రైనా విషయాన్ని ఆయన ఉదహరించారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను నియమించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. సెలెక్టర్లు ఆ దిశగా ఆలోచన చేయాలని ఆయన అన్నారు. క్రికెట్ ఎక్కువగా జగడమే కాకుండా ఫార్మాట్లు పెరిగాయని ఆయన అన్నారు.
English summary
Critical of Mahendra Singh Dhoni's rotation policy, former Indian skipper Sourav Ganguly says time has come for the selectors to appoint different cricket captains for the three formats of game.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST