ధోనీ, సెహ్వాగ్ మధ్య తాజా రచ్చ: బిసిసిఐ షాక్

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 16:07 [IST]
Virender Sehwag-Mahendra Singh Dhoni
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్‌కు మధ్య వివాదానికి సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీలంకపై జరిగిన మ్యాచుకు ముందు తుది జట్టు కూర్పుపై ఇరువురి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. తుది జట్టులోకి తీసుకోవాల్సిన 11 మంది ఆటగాళ్లపై వారిద్దరి మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంకపై ఆడే జట్టులోకి రోహిత్ శర్మను తీసుకోవాలని ధోనీ సూచించగా, ఆ మ్యాచుకు కెప్టెన్సీ చేసిన సెహ్వాగ్ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లతో ఆడడానికి మొగ్గు చూపాడు. ఈ వివాదం తెలిసి బిసిసిఐ దిగ్భ్రాంతికి గురైనట్లు చెబుతున్నారు. డ్రెసింగ్ రూంలోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలని బిసిసిఐ వారికి సూచించింది. ఈ సంఘటన తమను తీవ్ర కలవరానికి గురి చేసిందని, సీనియర్ ఆటగాళ్లు ఆ విధంగా ప్రవర్తించడం తాము ఇది వరకు చూడలేదని బిసిసిఐ వర్గాలు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. పైగా, శ్రీలంకపై ఘోరంగా ఓటమి పాలైన తర్వాత కెప్టెన్‌గా వ్యవహరించిన సెహ్వాగ్ ధోనీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
English summary
The public spat between Indian skipper MS Dhoni and Virender Sehwag took a new turn as they were divided over the team selection ahead of the Sri Lanka match.
User Comments
sreekanth chen 22 Feb 2012 04:51 pm
Dhoni need to respect seniors. He is telling that fielding is concern. India strength batting. India won becoz of batting. At that time fielding is not a criteria. Sehwag correctly replied regarding this
[ మీ వ్యాఖ్య రాయండి ]
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST