తేడాలపై గుప్పిట వీడింది: ధోనీకి సెహ్వాగ్ చురకలు

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 8:30 [IST]
Virender Sehwag
బ్రిస్బేన్: టీమిండియాలోని అంతర్గత పోరు నిజమేనని తేలిపోయింది. రొటేషన్ కారణంగా విభేదాల గుట్టు రట్టయింది. ధోనీకి వీరేంద్ర సెహ్వాగ్ చురకలు వేయడం ద్వారా విభేదాలను బయట పెట్టారు. సీనియర్ల ఫీల్డింగ్‌పై ధోనీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సీనియర్లు మండిపడుతున్నారు. తాజాగా, సెహ్వాగ్ గొంతు విప్పాడు. మంగళవారం లంక తో ఓటమితో అనంతరం మీడియా సమావేశంలో నేరుగా ధోనీపై విమర్శలు చేశాడు. ఫీల్డింగ్‌లో మందకొడిగా ఉంటున్నామని తనకు కాని ఇతర సీనియర్లకు కానీ ఎప్పు డూ చెప్పలేదని ఆయన అన్నాడు. 'అతను (ధోనీ) ఏమి మాట్లాడాడో, మీడియాలో ఏ కథనాలు వస్తున్నాయో నాకు తెలీదు. వచ్చే ప్రపంచ కప్ ఇక్కడ జరుగనుండడంతో ఆ టోర్నీలో ఆడే జూనియర్లకు వన్డేల్లో అవకాశమివ్వాలని మాతో చెప్పాడు' అని సెహ్వాగ్ చెప్పాడు.

సచిన్, వీరూ, గంభీర్ వల్ల ఫీల్డింగ్ సమస్యలు ఎదురవుతున్నాయని, అందువల్లే వీరిని రొటేషన్ పద్ధతిలో పక్కనపెడుతున్నామని ధోనీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, లంకతో మ్యాచ్‌లో 'ఎలా క్యాచ్ పట్టానో చూశారా?' అంటూ ఓ విలేకరిని ప్రశ్నించాడు. గత పదేళ్ల నుంచి ఒకే రీతిలో ఫీల్డింగ్ చేస్తున్నామని చెప్పాడు.

సీనియర్ల పేలవ ఫీల్డింగ్ వల్ల 20 పరుగులు అదనంగా ఇస్తున్నామన్న ధోనీ వ్యాఖ్యలపైనా వీరూ ఘాటుగా సమాధానమిచ్చాడు. ఆ విషయాన్ని ధోనీనే మరోసారి అడగండి అంటూ అతను సూచించాడు. యువ ఆటగాళ్ల కోసమే విశ్రాంతినిస్తున్నట్టు తనతో పాటు సచిన్, గంభీర్‌లకు ధోనీ స్వయంగా చెప్పాడని స్పష్టం చేశాడు. 'అతను జట్టుకు సారథి. కోచ్, కెప్టెన్‌లు టాపార్డర్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తే మేం అంగీకరించాలి. నేను అన్ని మ్యాచ్‌లకూ అందుబాటులో ఉన్నా. తుది జట్టుకు ఎవరిని ఎంపిక చేయాలన్నది వారిద్దరి నిర్ణయం. యువకులకు అవకాశమివ్వాలని చెబితే సంతోషంగా తప్పుకుంటాం' అని అన్నాడు.
English summary
Cracks in the Team India camp appeared to widen with the stand-in captain for Tuesday's match, Virender Sehwag, taking a jibe at regular skipper MS Dhoni for suggesting that senior batsmen were being rotated because they were slow movers on the field.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST