న్యూఢిల్లీ: సీనియర్లు, మాజీల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భార్య సాక్షి నుంచి ఊరట లభించింది. ధోనీకి భార్య పూర్తి మద్దతు పలుకుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో సరైన ఫామ్‌లో లేకపోవడంతో, రొటేషన్ పాలసీతో ధోనీపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మంగళవారం శ్రీలంకపై జరిగిన మ్యాచులో భారత్ 51 పరుగుల తేడాతో ఓడిపోవడానికి ధోనీ కారణం కారని ఆమె అన్నది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌లో రాసింది.
కిందికి లాగాలని అనుకుంటున్నవాళ్లను పట్టించుకోవద్దని, తాము ఎప్పటికీ మద్దతిస్తామనే విషయం మరిచిపోవద్దని, విమర్శించేవాళ్లు నోళ్లు మూసుకునే రోజు వస్తుందని ఆమె ధోనీని ఉద్దేశించి అన్నది. ప్రపంచ కప్ విజేతగా భారత్‌ను నిలబెట్టినప్పుడు ధోనీ ఎంతగా ప్రశంసలు అందుకున్నాడో ఇప్పుడు అంతగా విమర్శలను ఎదుర్కుంటున్నాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ స్లో ఫీల్డింగ్ వల్ల రొటేషన్ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు ధోనీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.