Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ

Posted by:
Updated: Friday, July 13, 2012, 15:51 [IST]

మెల్‌బోర్న్, జులై 13: ఆస్టేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు శుక్రవారం తన రిటైర్ మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలగినప్పటికీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బ్యాష్ లీగ్‌లో మాత్రం కంటిన్యూ అవుతానని అన్నాడు. 13 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన బ్రెట్ లీ అద్బుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. వచ్చే వారం శ్రీలకంతో జరిగే ట్వంటీ20 మ్యాచ్ బ్రెట్ లీకి అంతర్జాతీయ చివరి మ్యాచ్ కావచ్చు.

బ్రెట్ లీ కెరీర్ ట్రాక్ రికార్డు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ

35 సంవత్సరాల వయసు కలిగిన బ్రెట్ లీ తన రిటైర్ మెంట్‌ని శుక్రవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రకటించాడు. ఈ సందర్బంలో బ్రెట్ లీ మాట్లాడుతూ గత రెండు, మూడు రోజులుగా దీని గురించి ఆలోచించాను. ఈరోజు ఉదయం నిద్రలేవగానే నేను ఇక సిద్దంగా ఉన్నాననే భావన కలిగిందన్నాడు. మానసికంగాను, శారీరకంగాను - ప్రతి జట్టు 100 శాతం నిబద్దతతో మంచి వాతావరణంలో ఉండాలని భావిస్తున్నాను. ఆ తర్వాత కొద్ది నెలలు నేను ఎటువంటి కొరిక లేకుండా ఉండాలని అనుకుంటున్నాను. జీనితంలో ఎక్కడో ఒక చోట తగినంత చాలు అని చెప్తారు.

13 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగడం నిజంగా అద్బుతమైన కెరీర్. ఇంకా ఎక్కువ కాలం అడగలేను. 13 సంవత్సరాలు, శుక్రవారం 13.. రిటైర్‌మెంట్ ప్రకటించడానికి సరైన సమయంగా భావిస్తున్నానని అన్నాడు. నా జీనితంలో ఇక రెండు కొత్త అంశాలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నాను. ఒకటి సంతోషం. ఇంకొకటి ఉత్సాహం. ఇక నుండి నా హాలిడేస్ అన్ని ఇంట్లోనే అని అన్నారు.

టెస్టు క్రికెట్‌ నుంచి 2010లోనే బ్రెట్ లీ రిటైర్‌ అయ్యాడు. గత కొంతకాలంగా లీ గాయాల పాలవుతుండడంతో ఇంగ్లాండ్‌ సిరీస్‌ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. 1999లో బ్రెట్‌ లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. కెరీర్‌ మొత్తం ఫాస్ట్‌ బౌలర్‌గా పేరు నిలబెట్టుకున్న బ్రెట్‌ లీ1999లో భారత్‌పై ఆడిన మ్యాచ్‌లో శఠగోపన్‌ రమేష్‌ వికెట్‌ తీసి కెరీర్‌ ఆరంభించాడు.

బ్రెట్ లీ తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 76 టెస్టులు, 221 వన్డేలు, 25 ట్వింటీ20లు ఆడాడు. ఆస్టేలియా జట్టులో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న వికెట్ టేకర్‌గా మెగ్ గ్రాత్ పేరు ఉండగా.. ఆ తర్వాత రెండవ స్దానం బ్రెట్ లీదే. టెస్టుల్లో 300 పైగా వికెట్లు తీసుకున్న రికార్డు కూడా బ్రెట్ లీ సొంతం.

తెలుగు వన్ఇండియా క్రీడా విభాగం

Story first published:  Friday, July 13, 2012, 11:52 [IST]
English summary
Australia fast bowler Brett Lee on Friday announced his retirement from international cricket but will continue to play in the Indian Premier League and Big Bash League.
మీ వ్యాఖ్య రాయండి