Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఎరుపు రంగుని చూస్తుంటే కంపరం పుడుతుంది: యువీ

Posted by:
Updated: Friday, July 13, 2012, 9:37 [IST]

ఎరుపు రంగుని చూస్తుంటే కంపరం పుడుతుంది: యువీ
 

న్యూఢిల్లీ, జులై 13: క్యాన్సర్ చికిత్స తర్వాత తాను పూర్తిగా మారిపోయానని భారత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్, 2011 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ యువరాజ్ సింగ్ చెప్పాడు. గుర్గావ్‌లోని తన క్రికెట్ అకాడమీలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ గతంలో తనకు ఎరుపు రంగు అంటే ఇష్టమన్నాడు. కానీ ఇప్పుడు అదే ఎరుపు రంగును చూస్తుంటే కంపరం పుడుతుందని చెప్పాడు. నిజం చెప్పాలంటే ఏడాది క్రితం నేను ధరించే బట్టలు ఎక్కువగా ఎరుపు రంగులోనే ఉండేలా ఆసక్తి చూపేవాడని.. ఎప్పుడైతే క్యాన్సర్ వ్యాధికి గురైనానో ఆ తర్వాత నా ఇష్టాన్ని మార్చుకున్నానని అన్నారు.

క్యాన్సర్‌ బాధితులకు రక్తం అంటే భయమని, దానికి తాను కూడా అతిథుడ్ని కానని యువీ తెలిపాడు. భవిష్యత్తులో కూడా ఎరుపు రంగును తాను వ్యతిరేకిస్తానని యువీ స్పష్టం చేశాడు. వ్యాధి నుంచి కోలుకున్నాక ఆట పట్ల తన ధృక్పథం మారిందని.. దేశం కోసం మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూడడం గొప్పగా అనిపిస్తుందన్నాడు. ఇంతకుముందు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవాణ్ణి. ఇప్పుడు నా రెండు ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకోగలుగుతున్నాను. కీమో చికిత్స సమయంలో ఆహారం వాసన చూసేవాణ్ణి కానీ తినలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు సమోసా కూడా తింటున్నాను. మొత్తానికి మామూలు జీవితంలోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

ప్రాక్టీస్‌లో పాదాల కదలిక కొంచెం నెమ్మదిగానే ఉన్నా బంతిని బాగానే కొట్టగలుగుతున్నానని చెప్పాడు. రానున్న రోజుల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని... దీని కోసం ఇప్పుడిప్పుడే సాధనను మొదలు పెట్టానన్నాడు. అయితే జట్టులో స్థానం సులువుగా లభిస్తుందనే నమ్మకం లేదన్నాడు. దీని కోసం తాను ఎంతో కష్టపడక తప్పదన్నాడు.

తెలుగు వన్ఇండియా క్రీడా విభాగం

Story first published:  Friday, July 13, 2012, 9:36 [IST]
English summary
India's flamboyant batsman Yuvraj Singh has said that he has seen so much of blood that he hates the colour especially after undergoing treatment for a rare germ cell cancer earlier this year.
మీ వ్యాఖ్య రాయండి