Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

శ్రీలంక సిరిస్: వినయ్ కుమార్ స్దానంలో ఇర్పాన్ పఠాన్

Posted by:
Updated: Saturday, July 14, 2012, 12:41 [IST]

శ్రీలంక సిరిస్: వినయ్ కుమార్ స్దానంలో ఇర్పాన్ పఠాన్
 

ముంబై, జులై 14: ఒకరికి దురదృష్టం, ఇంకొకరికి అదృష్టం. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా..? భారత్ - శ్రీలంక మధ్య ఈ నెల 21 నుండి జరగబోయే వన్డే సిరిస్ కోసం జట్టులో ఇటీవల బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఫాస్ట్ బౌలర్ వినయ్‌ కుమార్‌‌ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు అనూహ్యాంగా అతని స్దానంలో ఇర్పాన్ పఠాన్ జట్టులోకి వచ్చాడు. అందుకు కారణం కర్ణాటక పేసరైన వినయ్ కుమార్ తొడకండరాల గాయంతో సిరిస్ నుండి తప్పుకోవడంతో అతని స్దానంలో లంక సిరస్‌కు ఇర్ఫాన్ పఠాన్‌‌ని ఎంపిక చేసినట్లు శుక్రవారం ప్రకటించింది.

ఈ నెల 21 నుంచి ఐదు వన్డే మ్యాచ్‌లు, ఆగస్టు 7న ఒక టి20 మ్యాచ్‌ భారత్‌ ఆడుతుంది. లంక టూర్‌కు ఎంపికయిన సందర్భంగా ఇర్ఫాన్ విలేకరులతో మాట్లాడుతూ మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కడంపై ఇర్ఫాన్‌ ఆనందం వ్యక్తం చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టులో స్థానాన్ని శాశ్వతం చేసుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. విమర్శకుల మాటల్ని గౌరవిస్తానని, మంచి ప్రదర్శన కనబరిచిన రోజున వాటిని మరిచిపోతానని ఇర్ఫాన్ చెప్పాడు. లంక టూర్‌కు వెళ్లడానికి ముందు భారత్‌లో సేవ్ టైగర్ ప్రచారంలో పాల్గొంటానని పేర్కొన్నాడు.

శ్రీలంకలో జరిగే సిరిస్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విశ్రాంతి తీసుకున్న సంగితి తెలిసిందే. గత పది నెలలుగా అలుపెరగకుండా క్రికెట్ ఆడుతుండండతో నా కుటుంబంతో కొంత సమయాన్ని గడపాలనే ఉద్దశ్యంతో ఈ నెల 21 నుండి ప్రారంభం కానున్న శ్రీలంక సిరిస్‌లో విశ్రాంతి తీసుకున్నట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కోన్నాడు. మా పిల్లల స్కూళ్లకు సెలవులు కావడంతో వారితో ప్రయివేట్‌గా కొంత సమయం గడిపేందుకు అనుమతి కావాలని బిసిసిఐని కోరడం జరిగిందన్నాడు.

తెలుగు వన్ఇండియా క్రీడా విభాగం

Story first published:  Saturday, July 14, 2012, 11:02 [IST]
English summary
India's all-rounder, Irfan Pathan pleased to be back in the side after Karnataka pacer Vinay Kumar was ruled out of the Sri Lankan tour due to an injury has said that he wants to make his presence felt and utilize the opportunity to cement his place in the team.
మీ వ్యాఖ్య రాయండి