Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ రిటైర్‌మెంట్ పై సచిన్ టెండూల్కర్ ట్వీట్

Posted by:
Updated: Monday, July 16, 2012, 12:09 [IST]

న్యూఢిల్లీ, జులై 16: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ మెంట్ ప్రకటించిన ఆస్టేలియా ఫాస్ట్ బౌలకర్ బ్రెట్ లీపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. బౌలర్ బ్రెట్ లీ బౌలింగ్‌ను ఎదుర్కోవడాన్ని తాను ఎంతో ఆస్వాదించానని సచన్ ట్వీట్ చేస్తే.. బ్రెట్ లీ రిటైర్ మెంట్ పై యువరాజ్ సింగ్ విచారాన్ని వ్యక్తం చేశాడు.

బ్రెట్ లీ కెరీర్ ట్రాక్ రికార్డు

బింగా(బ్రెట్ లీ ముద్దు పేరు)తో ఆడడాన్ని ఆస్వాదించాను. భవిష్యత్తులో అతడికి మేలే జరగాలని కోరుకుంటున్నా అని సచిన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు బ్రెట్ లీ స్పందిస్తూ కృతజ్ఞతలు మిత్రమా.. నీకు బౌలింగ్ వేసేటప్పుడు నాలో అత్యుత్తమ ఆట బయడపడిందని బ్రెట్ లీ రీ ట్వీట్ చేశాడు.

ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ రిటైర్‌మెంట్ పై సచిన్ టెండూల్కర్ ట్వీట్

బ్రెట్ లీ రిటైర్ మెంట్ వార్త తెలియగానే యువరాజ్ సింగ్ తన ట్విట్టర్‌లో బ్రెట్ లీ మంచి వ్యక్తి. నాకు మంచి మిత్రుడు. అతను రిటైర్ అవ్వడం నాకు విచారాన్ని కలిగించిందని తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. 2004వ సంవత్సరంలో ఇండియా - ఆస్టేలియా టూర్‌లో భాగంగా యువరాజ్ సింగ్ బ్రేట్ లీతో కొన్ని ఆనందపు క్షణాలను పంచుకున్నాడు.

2004లో పెర్త్ సిరిస్‌లో భాగంగా ఆస్టేలియా పర్యటనలో బ్రెట్ లీతో నా ఆనందపు క్షణం.. గిల్ క్రిస్ట్ 30 గజాల దూరంలో సర్కిల్ వద్ద నుంచోని ఉండగా.. బింగా(బ్రెట్ లీ ముద్దు పేరు) 155 కిమీ వేగంతో పరిగెత్తుతూ వచ్చే సన్నివేశం ఇప్పటికీ నా కళ్లలో కదిలాడుతూనే ఉందని అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 13 సంవత్సరాల పాటు అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగిన బ్రెట్ లీ శుక్రవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో రిటైర్ మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలగినప్పటికీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బ్యాష్ లీగ్‌లో మాత్రం కంటిన్యూ అవుతానని అన్నాడు. 13 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన బ్రెట్ లీ అద్బుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. వచ్చే వారం శ్రీలకంతో జరిగే ట్వంటీ20 మ్యాచ్ బ్రెట్ లీకి అంతర్జాతీయ చివరి మ్యాచ్ కావచ్చు.
కెరీర్‌ మొత్తం ఫాస్ట్‌ బౌలర్‌గా పేరు నిలబెట్టుకున్న బ్రెట్‌ లీ1999లో భారత్‌పై ఆడిన మ్యాచ్‌లో శఠగోపన్‌ రమేష్‌ వికెట్‌ తీసి కెరీర్‌ ఆరంభించాడు.

బ్రెట్ లీ తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 76 టెస్టులు, 221 వన్డేలు, 25 ట్వింటీ20లు ఆడాడు. ఆస్టేలియా జట్టులో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న వికెట్ టేకర్‌గా మెగ్ గ్రాత్ పేరు ఉండగా.. ఆ తర్వాత రెండవ స్దానం బ్రెట్ లీదే. టెస్టుల్లో 300 పైగా వికెట్లు తీసుకున్న రికార్డు కూడా బ్రెట్ లీ సొంతం.

తెలుగు వన్ఇండియా క్రీడా విభాగం

Story first published:  Monday, July 16, 2012, 12:07 [IST]
English summary
Master Blaster Sachin Tendulkar lauded Australian pace spearhead Brett Lee, who announced his retirement last week, and said it was a 'joy' to pad up against the speedster.
మీ వ్యాఖ్య రాయండి