Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

దయాదాక్షిణ్యాలు వద్దు: సచిన్‌కు ఇమ్రాన్ సలహా

Posted by:
Published: Thursday, September 13, 2012, 9:33 [IST]

 దయాదాక్షిణ్యాలు వద్దు: సచిన్‌కు ఇమ్రాన్ సలహా
 

న్యూఢిల్లీ: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ భవితవ్యంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యా ఖ్యలు చేశాడు. కెరీర్‌లో ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడే వీడ్కో లు చెప్పాలని, సెలెక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడరాదని ఆయన సచిన్‌కు సూచించాడు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో మాస్టర్ మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ పరుగులకే క్లీన్‌బౌల్డయిన సం గతి తెలిసిందే. దీంతో అతని రిటైర్మెంట్‌పై మరోసారి చర్చ మొదలైన నేపథ్యంలో ఇమ్రాన్ స్పందించాడు.

'సచిన్ గొప్ప ఆటగాడు. అద్భుతమైన రికార్డులు సాధించాడు. 23 ఏళ్లుగా భారత అభిమానులు అతని ఆటను ఆస్వాదిస్తున్నారు. మాస్టర్‌తో వారికి భావోద్వేగమైన అ నుబంధముంది. సచిన్‌లేని క్రికెట్‌ను వారు ఊహించుకోలేరు. అయితే, కెరీర్‌లో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే వీ డ్కోలు పలకాలి. అతని స్థానంలో నేనుంటే వైదొలిగేవా ణ్ని. సెలెక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడరాదనేది నా ఆందోళన' అని ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ అన్నాడు.

ఏ ఆటగాడైనా తన సామర్థ్యం మేరకు ఆడలేని దశలో వైదొలిగితే అతని ఉన్నత కెరీర్‌ను అభిమానులు గుర్తుంచుకోరని పాక్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. కాగా తన భవితవ్యంపై సచినే నిర్ణయం తీసుకోవాలని వ్యా ఖ్యానించాడు. సచిన్ వైపు నుంచి ఆలోచిస్తే, క్రికెట్ వల్లే అతను ఇంత గౌరవం పొందాడని అర్థం చేసుకోవచ్చని చెప్పాడు. అయితే, రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అతనికి ఆసన్నమైందని ఇమ్రాన్ అన్నాడు.

తన కెరీర్ విషయంలో ఇలాంటి నిర్ణయమే తీసుకున్నానని పేర్కొన్నాడు. తన సారథ్యంలో 1992 ప్రపంచ కప్ విజయం సాధించాక రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని పాక్ మాజీ కెప్టెన్ గుర్తుచేశాడు. సెలెక్టర్ల ద యపై ఆధారపడరాదన్నదే తన నిర్ణయానికి కారణమని ఇమ్రాన్ అన్నాడు.

English summary
Pakistan cricket team former captain Imran Khan suggested Indiana master blaster Sachin Tendulkar not to depend on secectors mercy.

Please read our comments and moderation policy before posting

మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu