Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ప్రివ్యూ: దక్షిణాఫ్రికాతో జింబాబ్వే చావో రేవో

Posted by:
Published: Thursday, September 20, 2012, 10:18 [IST]

 ప్రివ్యూ: దక్షిణాఫ్రికాతో జింబాబ్వే చావో రేవో
 

కొలంబొ: ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో పడింది. గురువారం రాత్రి ఈ జట్టు అత్యంత బలమైన ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను ఎదుర్కోబోతోంది. గ్రూప్- సి తొలి మ్యాచ్‌లో శ్రీలంకచేతిలో చిత్తుగా ఓడిన జింబాబ్వే రెండో మ్యాచ్‌లో పటిష్టమైన దక్షిణాఫ్రికా తో సమరానికి సిద్ధమవుతోంది. గురువారం జరిగే ఈ మ్యాచ్‌తో జింబాబ్వే భవితవ్యం కూడా తేలిపోనుంది.

గ్రూప్ దశ నుంచి గట్టెక్కి సూపర్ 8కు చే రాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో ఆ జట్టు బరిలోకి దిగుతుంటే తొలి మ్యాచ్‌లో సునాయాస విజయానికి సఫారీలు ఎదురు చూస్తున్నారు. అనుభవంలేని జింబాబ్వే జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించాలని ఎబి డివిలియర్స్ సేన ఆరాట పడుతోంది. టేలర్ సేన అనుభవలేమి శ్రీలంకతో తొలిమ్యాచ్‌లోనే స్పష్టమైంది. నలుగురు బ్యాట్స్‌మెన్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరారు. ఇక బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ బ్రెండన్ టేలర్ - తమ వైఫల్యాలను గుర్తించి, వాటిపై తీవ్రంగా కసరత్తు చేసి వచ్చే మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అది నిజం చేయగలిగితే పసికూన సంచలనమే సృష్టిస్తుంది. వామప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న సఫారీలు, ఈ మ్యాచ్‌లో భారీ విజయంతో ప్రపంచకప్ ప్రస్థానాన్ని ప్రారంభించాలని కోరుకుంటోంది.

లెవి, ఆమ్లా, కలిస్ లాంటి పటిష్ట బ్యాటింగ్ లైనప్, డేల్ స్టెయిన్, అల్బీ మోర్కెల్, రాబిన్ పీటర్సన్ బౌలింగ్ ధాటికి జింబాబ్వే నిలబడగలుగుతుందా, సఫారీలు కోరుకుంటున్నట్లు భారీ విజయాన్ని అందిస్తుందా, అంతకు ముందు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన అనధికార టోర్నీలో గెలుపును ఇక్కడ కూడా సాధించి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమవుతుంది.

జట్లు:

దక్షిణాఫ్రికా: ఎబి డీవిలియర్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), హషీం ఆమ్లా, పర్షాన్ బెహర్దీన్, జోహన్ బోథ, జెపి డుమిని, ఫాప్ డు ప్లెసిస్, జాక్విస్ కల్లిస్, రిచర్డ్ లేవీ, ఎల్బీ మోర్కెల్, మోర్నె మోర్కెల్, జస్టిన్ ఓంటోంగో, వెయినే పార్నెల్, రాబిన్ పీటర్సన్, డేల్ స్టెయిన్, లోన్వాబో త్సోత్సోబే

జింబాబ్వే: బ్రెడన్ టైలర్ (కెప్టెన్, వికెట్ కీపర్), వుస్ని సిబంద, హామిల్టన్ మసకద్జ, స్టార్ట్ మత్సికెన్యెరీ, మాల్కం వాల్లర్, ఎల్టోన్ చిగుంబుర, క్రెయిగ్ ఎర్విన్, గ్రేమ్ క్రెమెర్, రే ప్రైస్, కైలె జర్వీన్, క్రిస్ పోఫు, రిచర్డ్ మఝంగే, బ్రెయిన్ విటోరీ, ప్రాస్పర్ ఉత్సేయ, ఫోస్టర్ ముతిజ్వా

English summary
South Africa, without any global trophy in their cabinet, will once again attempt to correct that record when they open campaign against Zimbabwe in ICC World Twenty20 2012 here on Thursday night.
మీ వ్యాఖ్య రాయండి