Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

మెక్‌కుల్లం సెంచరీ: బంగ్లాపై 59 రన్స్‌తో కివీస్ విజయం

Posted by:
Updated: Saturday, September 22, 2012, 9:01 [IST]

పల్లెకేలి: ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. బ్రెండన్ మెక్‌కుల్లం బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. విజయానికి బంగ్లాదేశ్ 192 పరుగులు చేయాల్సి ఉండగా లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో మెక్‌కుల్లం అత్యధిక స్కోరు సాధించాడు. అద్భుతమైన సెంచరీ (123)తో అతను ఆకట్టుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది.

బంగ్లాదేశ్ - న్యూజిలాండ్ మ్యాచ్ స్కోరు కార్డు

మెక్‌కుల్లం సెంచరీ: బంగ్లాపై 59 రన్స్‌తో కివీస్ విజయం

ఫ్రాంక్లిన్ (35)తో కలిసి అతను రెండో వికెట్‌కు 94 పరుగులను జోడించాడు. గుప్తిల్ (11) చాలా త్వరగా అవుటైనప్పటికీ కివీస్ జోరు తగ్గించలేదు. ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మెక్‌కుల్లంకు ఇదే రెండో సెంచరీ. రాస్ టైలర్ (14 నాటవుట్)తో కలిసి మూడో వికెట్‌కు అతను 78 పరుగులు జోడించాడు. మెక్‌కుల్లం 123 పరుగుల్లో 11 ఫోర్లు, ఏడు సిక్స్‌లు ఉన్నాయి.

స్పిన్నర్లపై ఆధారపడిన బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గుప్తిల్‌ను అబ్దుర్ రజాక్ చాలా త్వరగా అవుట్ చేసినప్పటికీ బంగ్లాదేశ్ బౌలర్లు న్యూజిలాండ్ దూకుడును తగ్గించలేకపోయారు.

జట్లు:

న్యూజిలాండ్: రాస్ టైలర్ (కెప్టెన్), మార్టిన్ గుప్తిల్, రోబ్ నికోల్, బ్రెండన్ మెక్‌కుల్లం, కనే విలియమ్సన్, బిజె వాటింగ్ (వికెట్ కీపర్), జేమ్స్ ఫ్రాంక్లిన్, జాకోబ్ ఓరమ్, నాథన్ మెక్‌కుల్లం, డేనియల్ వెట్టోరీ, కైలే మిల్స్, డౌగ్ బ్రేస్‌వెల్, టిమ్ సౌథీ, రోన్నీ హిరా, ఆడం మిల్నే

బంగ్లాదేశ్: ముష్పిఖుర్ రహీం (కెప్టెన్, వికెట్ కీపర్), మొహ్మద్ మహ్మదుల్లా, తమీమ్ ఇక్బాల్, మొహ్మద్ అష్రాఫుల్, జునైద్ సిద్దిఖి, జహురుల్ ఇస్లాం, షకీబ్ ఆల్ హసన్, నసీర్ హొస్సేన్, జియూర్ రహ్మన్, ఎలియాస్ సన్నీ, అబ్దుర్ రజాక్, మష్రఫే మొర్తాజా, షఫియుల్ ఇస్లాం, ఫర్హాద్ రేజా, అబ్దుల్ హసన్

Story first published:  Friday, September 21, 2012, 18:05 [IST]
English summary
New Zealand's Brendon McCullum scored a magnificent ton to help his team post 191/3 in 20 overs, after being put into bat by Bangladesh in the fifth game of World T20 at Pallekele on Friday.

Please read our comments and moderation policy before posting

మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu