Search
Newsletter
 
Share This Story

ఐపిఎల్ 6 ధమాకా: ఏప్రిల్ 3న ఢిల్లీ X కోల్‌కతా

Posted by:
Published: Friday, December 21, 2012, 14:41 [IST]

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 6 2013 షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించారు. ఐపిఎల్ 6 మొదటి మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. ఏప్రిల్ 3వ తారీఖున కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తలపడనుంది. ఐపిఎల్ 6లో తొమ్మిది జట్లు పాల్గొననున్నాయి.

ఈ జట్లు అన్ని గతంలోలాగే సొంత మైదానాలలో ఒక ఆట, ప్రత్యర్థి మైదానంలో ఒక ఆట ఆడనున్నాయి. క్వాలిఫయర్ వన్‌కు ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఎలిమినేటర్ గేమ్స్ 21, 22న జరగనున్నాయి. మొత్తం 11 వేదికలపై ఐపిఎల్ 6 మ్యాచులుజరగనున్నాయి.

హైదరాబాద్‌కు చెందిన దక్కన్ ఛార్జర్స్ జట్టు బదులు కొత్తగా సన్ రైజర్ వచ్చింది. సన్ టివి నెట్ వర్క్ హైదరాబాద్ జట్టును దక్కించుకుంది. ప్రముఖ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ పెప్సీ కొత్తగా టైటిల్ స్పాన్సర్ షిప్‌ను ఇటీవల దక్కించుకుంది. పెప్సీ కంపెనీ రూ.396 కోట్లకు దీనిని దక్కించుకుంది.

pepsi ipl players auction on feb 3 2013

ఐపిఎల్ సిఈవో సుందర్ రామన్... ఐపిఎల్ 6 కోసం ఆక్షన్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 3న ఉంటుందని ట్వీట్ చేశారు. ఆక్షన్ కోసం ఇంకా వేదికను నిర్ణయించలేదని చెప్పారు. పెప్సీ ఐపిఎల్ ఆక్షన్ ఫిబ్రవరి 3న ఉంటుందని రామసుందర్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఏప్రిల్ 3న మొదటి మ్యాచ్ ఉంటుందని ఐపిఎల్ వెబ్ సైట్లో పెట్టారు.

రెండో మ్యాచ్‌కు బెంగళూరు వేదిక కానుంది. ఐపిఎల్ 5 ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ - ఢిల్లీ డేర్ డెవిల్స్ ఏప్రిల్ 3న తలపడనున్నాయి. ఐపిఎల్ 6లో 179 మంది ఆటగాళ్లను ఎక్స్టెండ్ చేశారు.

English summary
IPL CEO Sundar Raman on Friday announced that the players' auction for Pepsi IPL, the sixth edition of the cash rich league would be held on Feb 3, 2013.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu