ముంబై: భారత్‌తో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచు ఉత్కంఠభరితంగా ముగిసింది. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా మోర్గాన్ సిక్స్ కొట్టి ఇంగ్లాండుకు విజయాన్ని అందించాడు. దీంతో ఇంగ్లాండు రెండు మ్యాచుల సిరీస్‌ను 1-1 స్కోరుతో సమమ చేసింది. కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ 25 బంతుల్లో 49 పరుగులు చేశాడు. భారత్‌పై ఇంగ్లాండు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ తమ ముందు ఉంచిన 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండు ఓపెనర్లు లుంబ్ (50), హేల్స్ మంచి ప్రారంభాన్నిచ్చారు.
ఇన్నింగ్స్ మొదట్లో భారత్ మిస్ ఫీల్డింగ్, క్యాచ్‌లను జారవిడవడం పెద్ద సమస్యగా మారింది. ఓటమి తప్పదని భావించిన స్థితిలో యువరాజ్ సింగ్ నాలుగు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చిన మూడు వికెట్లు తీసుకోవడంతో భారత జట్టులో ఆశలు చెలరేగాయి. అయితే, మిగతా బౌలర్లు ఎవరూ రాణించలేకపోయారు. దిండా ఓ వికెట్ తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.
అంతకు ముందు ఇంగ్లాండు ముంబైలో శనివారం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లీ క్లాసిక్ షాట్స్, ధోనీ, సురేష్ రైనా భాగస్వామ్యంతో మంచి టార్గెట్‌ను ఇండియా ఇంగ్లాండు ముందు ఉంచింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన షాట్స్‌తో అలరించాడు. రహనే మూడు పరుగులకే అవుటైనప్పటికీ ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 38 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ధోనీ (38), సురేష్ రైనా (34 నాటవుట్) సమయస్ఫూర్తితో ఆడి భారత్ స్కోరును పెంచారు. దీంతో భారత నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
ఇంగ్లాండు బౌలర్లలో డెర్న్‌బ్యాచ్, రైట్ రెండేసి వికెట్లు తీసుకోగా, బ్రెస్నన్, మీకర్, ట్రెడ్‌వెల్ తలో వికెట్ తీసుకున్నారు. తొలి ట్వంటీ20 మ్యాచులో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తుది జట్టులో భారత్ ఒక మార్పు చేసింది. రవీంద్ర జడేజా స్థానంలో రోహిత్ శర్మ తుది జట్టులోకి వచ్చాడు.
యువరాజ్ సింగ్ అనుభవం, సమర్థత తొలి ట్వంటీ20 మ్యాచులో భారత్ ఇంగ్లాండుపై ఘన విజయం సాధించింది. ఇంగ్లాండుతో ట్వంటీ20 సిరీస్ ముగిసిన తర్వాత వెంటనే ఉత్కంఠభరితమైన పాకిస్తాన్‌తో సిరీస్ జరగనుంది. తొలి ట్వంటీ మ్యాచులో యువరాజ్ సింగ్ 21 బంతుల్లో 38 పరుగులు చేయడమే కాకుండా మూడు వికెట్లు తీశాడు.
తుది జట్లు
ఇండియా: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), గౌతం గంభీర్, అజియంక్యా రహనే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, పియూష్ చావ్లా, అశోక్ దిండా, పర్వీందర్ అవానా
ఇంగ్లాండు: ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), టిమ్ బ్రెస్నన్, జోస్ బట్లర్, జడే డెర్న్‌బ్యాచ్, అలెక్స్ హేల్స్, మైఖెల్ లుంబ్, స్టార్ట్ మీకర్, సమిత్ పటేల్, జ్యో రూట్, జేమ్స్ ట్రెడ్‌వెల్, ల్యూక్ రైట్











