Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ప్రివ్యూ: క్లీన్ స్వీప్‌పై దృష్టి, రాయుడికి కష్టమే

Posted by:
Published: Saturday, December 22, 2012, 12:45 [IST]

ముంబెై: స్వదేశంలో టెస్ట్‌ సీరీస్‌ను కోల్పోయిన ధోనీ సేన కనీసం టీ20నెైనా దక్కించుకొని కొంత ఊరట పొందాలని తాపత్రయపడుతోంది. తొలి ట్వంటీ20 మ్యాచులో విజయం సాధించిన ఇండియా రెండో మ్యాచులోనూ విజయం సాధించి క్లీన్ స్పీ చేయాలనే పట్టుదలతో ఉంది. కాగా అనుకున్న స్థాయిలో రాణించేందుకు భారత్‌కు ప్రధానంగా బౌలింగ్‌ సమస్య వెంటాడుతోంది. గత టెస్ట్‌ సీరీస్‌ మొదలు కొని ఇటీవలి టీ20 మ్యాచ్‌ వరకూ ఏ ఒక్క ప్రధాన బౌలర్‌ మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచిన సందర్భం లేకపోవడంతో ఈ సమస్యను అధిగమించేందుకు ధోనీ ప్రయత్నాలు సాగిస్తున్నాడు.

యువరాజ్‌ సింగ్ తొలి ట్వంటీ20లో అద్భుతమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మ్యాచ్‌ని గెలిపించాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ కొహ్లీ, సురేష్‌ రెైనా, యువరాజ్‌, ధోనీ అందరూ అవసరానికి తగ్గట్టుగా బ్యాటింగ్‌ చేశారు. దీంతో బౌలింగుపైనే భారత్ ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సిన అగత్యంలో పడింది. ఈ మ్యాచ్‌లోనెైనా అశ్విన్‌, దిండా, జడేజా పుంజుకుంటే తప్ప జట్టుకు బౌలింగ్‌ కష్టాలు తప్పేలా లేవు. ఇక పోతే రిజర్వ్‌ స్థానానికే పరిమితమైన రోహిత్‌ శర్మకు ఈ మ్యాచ్‌లోనెైనా ఆడే అవకాశం వస్తుందో లేదో చూడాలి. ప్రత్యేకించి టీ20ల కోసం జట్టులోకి తీసుకున్న అవానా పూర్తిగా నిరాశ పర్చడంతో అతన్ని మార్చాలా.. వద్దా? అనే సందిగ్దంలో పడ్డాడు ధోనీ.

ఇక జడేజా, చావ్లాలకు మరో అవకాశం ఇచ్చి చూడాలనే దృక్పదంతోనే ధోనీ వ్యవహించే అవకాశాలున్నాయని విశ్లేకుల అంచానా. ఇక పోతే ఎంతో కాలం తర్వాత తొలి సారి జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్న అంబటి రాయుడును ఈ మ్యాచ్‌కి కూడా పెవీలియన్‌కే పరిమితం చేసే ఆలోచనలో ధోనీ ఉన్నట్లు సమాచారం.ఈ మ్యాచులో ఆడకపోతే రాయుడిని పాక్‌తో సీరీస్‌కు జట్టులోకి ఎంపిక చేస్తారన్న గ్యారంటీ లేదు.

ప్రివ్యూ: క్లీన్ స్వీప్‌పై దృష్టి, రాయుడికి కష్టమే

మరోవైపు, శనివారంనాటి మ్యాచ్‌లో విజయం సాధించి భారత్‌కు ఆ ఒక్క అవకాశం కూడా దక్కకుండా చూడాలని చూస్తున్న ఇంగ్లాండ్‌ చక్కని బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించిన హాల్స్‌, అతనికి సహకరించిన రెైట్‌ మరో సారి విజృంభించే అవకాశాలున్నాయి. కాగా తొలి మ్యాచ్‌లో 1 పరుగుకే పెవీలియన్‌కు చేరి లుంబ్‌ తన పరుగుల దాహాన్ని తీర్చుకునేందుకు ముంబెైని వేదిక చేసుకునే అవకాశం ఉంది. శనివారంనాటి రెండో టీ20 మ్యాచ్‌ నేటి రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

English summary
India will aim to make a clean sweep of the two-match Twenty20 International series against England as they face the visitors here on Saturday. Following the debacle in Test series, India, led by Yuvraj Singh's superb show, won with five wickets to spare on Thursday night in Mumbai. MS Dhoni-led outfit was looking in top form in the shortest format and are now favorites to win 2-0.
మీ వ్యాఖ్య రాయండి