Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

పాక్‌తో సిరీస్‌కు సచిన్ సై: చోటు దొరుకుతుందా?

Posted by:
Published: Saturday, December 22, 2012, 9:59 [IST]

పాక్‌తో సిరీస్‌కు సచిన్ సై: చోటు దొరుకుతుందా?
 

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు సచిన్ టెండూల్కర్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అయితే, అతనికి చోటు ఇవ్వాలా, వద్దా అనే విషయంపై తొలిసారి చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బిసిసిఐలో దానిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బోర్డులో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాస్టర్‌కు స్థానం కల్పించడానికి బోర్డులో కొందరు విముఖంగా ఉన్నట్టు ఓ జాతీయ చానెల్ వెల్లడించింది. ఈ నెల 30 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌కు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే.

సచిన్ ఫామ్, మనసులో మాటను పక్కనపెడితే, బోర్డులో అతణ్ని సమర్థించేవారికి కొదవలేదు. ఈ జాబితాలో బోర్డు అ ధ్యక్షుడు శ్రీనివాసన్ కూడా ఉ న్నారు. అయినా తన భవితవ్యంపై సచిన్‌కు ఓ సంకేతాన్ని పంపాలని కొందరు బోర్డు పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. పాక్‌తో వన్డేలకు సచిన్‌ను తప్పించాలన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తోందని అంటున్నారు.

తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని భావిస్తున్న టెండూల్కర్ పాక్‌తో సిరీస్‌లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. సచిన్‌కు స్థానం లభిస్తుందా లేదా అన్న విషయం తేలాలంటే ఆదివారం దాకా ఆగాల్సిందే. ఎందుకంటే ఆ రోజు వన్డే సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. మాస్టర్‌కు నిజంగానే మొండిచేయి చూపితే అదో పెను సంచలనమే. ప్రస్తుత పరిస్థితుల్లో సెలెక్టర్లు ఈ సాహసం చేస్తారా అనేది సందేహమే.

పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌లో ఆడేందుకు సచిన్ సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. ఈమేరకు మాస్టర్ తన భవితవ్యంపై చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్‌తో మాట్లాడినట్టు సమాచారం. పాక్‌తో పాటు తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లోనూ ఆడాలని భావిస్తున్నట్టు సందీప్ దృష్టికి తీసుకెళ్లాడట. ఇందుకు సెలెక్టర్లు కూడా సుముఖంగా ఉన్నట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడేందుకు పాటిల్ నిరాకరించాడు.

కాగా గత ప్రపంచ కప్ తర్వాత సచిన్ వన్డేల్లో ఎక్కువగా ఆడలేదు. ఈ ఏడాది ఆసియా కప్‌లో వందో సెంచరీ సాధించాడు. పాక్ సిరీస్‌లో పాల్గొనాలన్న సచిన్ నిర్ణయాన్ని గంగూలీ సమర్థించాడు. మాస్టర్‌ను సెలెక్టర్లు తప్పించకపోవచ్చని దాదా అభిప్రాయపడ్డాడు.

English summary
Master blaster Sachin Tendulkar has spoken to the chief selector Sandeep Patil and confirmed his availability for the upcoming ODI series against Pakistan and England, according to reports.

Please read our comments and moderation policy before posting

మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu