Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కెప్టెన్‌గా ధోనీ పనికిరాడు, కోహ్లీ మేలు: చాపెల్

Posted by:
Published: Tuesday, July 15, 2014, 15:55 [IST]

కెప్టెన్‌గా ధోనీ పనికిరాడు, కోహ్లీ మేలు: చాపెల్
 

హైదరాబాద్: టెస్టు క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీని ఇంటికి సాగనంపాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డారు. ధోనీని ఇంటికి పంపి, అతని స్థానంలో యువ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బాధ్యతలు అప్పగించాలని కోరారు. టెస్టు క్రికెట్ కెప్టెన్‌గా ధోనీ పనికి రాడని ఆయన అన్నారు.

టెస్ట్ కెప్టెన్‌గా ధోనీని తప్పించి యువ సంచలనం కోహ్లీకి నాయకత్వం అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని చాపెల్ చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రం ధోనీ అద్భుత నాయకుడంటూ ఆయన కితాబు ఇచ్చారు. 27 ఏళ్ల వయసున్న కోహ్లీ జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఇదే సరైన సమయమని తెలిపాడు.

భారత జట్టును నడిపించడానికి యువనాయకత్వం అవసరమని చెప్పాడు. పిటిఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చాపెల్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పుడు కోహ్లీకి టెస్టు కెప్టెన్సీ అప్పగించడంలో ఏ విధమైన సమస్య ఉండదని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.

భారత జట్టును నడపడానికి తాజా బుద్ధి అవసరమని, అయితే భారత సెలెక్టర్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోరని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా అందుకు భిన్నంగా ఉంటుందని ఆయన చెప్పారు. భారత సెలెక్టర్లు ఆటగాడు రిటైర్ అయ్యే దాకా వేచి చూస్తారని అన్నారు. ధోనీ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఉండి ఉంటే ఇది వరకే తప్పించి ఉండేవారని అన్నారు. జట్టుకు స్ఫూర్తినివ్వడానికి ధోనీ చేసిందేమీ లేదని అన్నారు.

English summary
Former Australia captain Ian Chappell does not find Mahendra Singh Dhoni good enough to be India's Test captain, saying he was past his prime as far as leading the side and it was right time to hand the reins of the team to Virat Kohli.
మీ వ్యాఖ్య రాయండి