Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

లార్డ్స్ విజయంలో తండ్రీ కొడుకులు: ఎవరేమన్నారు

Updated: Tuesday, July 22, 2014, 14:28 [IST]

లండన్: లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌పై భారత్ రెండు సార్లు గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓ తండ్రీ కొడుకులు భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. 1986లో మొదటిసారి లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లాండ్‌ను ఓడించిన భారత జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడు. మొదటి ఇన్నింగ్స్‌లో అతను 55 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

రెండో ఇన్నింగ్స్‌లో రోజర్‌కు మరో వికెట్ లభించింది. కాగా, తాజాగా ఇంగ్లాండ్‌ను ఓడించిన జట్టులో రోజర్ తనయుడు స్టువర్ట్ బిన్నీ ఉన్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు బౌల్ చేసి 45 పరుగులిచ్చిన అతనికి వికెట్ లభించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో స్టువర్ట్ బౌలింగ్‌కే దిగలేదు. మొత్తం మీద రెండు చారిత్రక విజయాల్లో తండ్రీకొడుకులు భాగస్వాములు కావడం విశేషం.

మోడీ అభినందనలు: చిరస్మరణీయమన్న ధోనీ

లార్డ్స్ విజయంలో తండ్రీ కొడుకులు: ఎవరేమన్నారు

నరేంద్ర మోడీ

లార్డ్స్ మైదానంలో అద్భుత విజయం సాధించిన టీమిండియాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన మాకు గర్వకారణమని ఆయన అన్నారు.

సచిన్ టెండూల్కర్

లార్డ్స్ విజయంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. దేశం మొత్తానికి ఇది అమూల్యమైన రోజు అని, ఇది మరిచిపోలేని అద్భుత విజయమని చెప్పాడు. ప్రస్తుత జట్టు ఈ ఘనతను సాధించినందుకు గర్వంగా ఉందని తెలిపాడు. ఏడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. 28ఏళ్ల తర్వాత మళ్లీ లార్డ్స్ మైదానంలో టీమిండియా విజయం సాధించడం గొప్పగా ఉందని తెలిపాడు. తాను మ్యాచ్ మొత్తాన్ని తిలకించనప్పటికీ.. ఇషాంత్ శర్మ బౌలింగ్ విన్యాసాల్ని చూసినట్లు తెలిపాడు. అతను చాలా ప్రతిభ గల ఆటగాడని, చాలా కఠినంగా శ్రమిస్తాడని చెప్పాడు. అతనిపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదని అన్నాడు.

ఎంఎస్ ధోనీ

లార్డ్స్ మైదానంలో చిరస్మరణీయ విజయాన్ని సాధించామని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. 2011 టూర్‌లో ఎదురైన పరాభవాలు ఎన్నో పాఠాలు నేర్పాయని మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారని ధోనీ ప్రశంసించాడు.

షేన్ వార్న్

‘ఇంగ్లాండ్‌ను భారత్ బెంబేలెత్తించింది. అత్యంత పచ్చని మైదానంపై ఇంగ్లాండ్ టాస్ గెలిచిన విషయం మరువొద్దు. ఆ జట్టులో మార్పు అవసరం' అని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అన్నాడు.

వివియస్ లక్ష్మణ్

భారత మాజీ ఆటగాడు వివియస్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఒక అద్భుత విజయమని చెప్పాడు. ధోనీ సేనకు ఆయన అభినందనలు తెలిపాడు. దేశం గర్వించేలా చేశారని ప్రశంసించాడు.

మైకేల్ వాన్

ఇంగ్లాండ్ జట్టు మాజీ సారథి మైకేల్ వాన్ టీమిండియాకు అభినందనలు తెలిపాడు. లార్డ్స్‌లో అద్భుత విజయానికి టీమిండియాకు సంపూర్ణ అర్హత కలదని అన్నాడు. అచ్చమైన ఇంగ్లిష్ పిచ్‌పై ఇంగ్లాండ్‌ను మట్టికరిపించారని అన్నాడు.

Story first published:  Tuesday, July 22, 2014, 13:30 [IST]
English summary
Stuart Binny and his father, former cricketer Roger Binny participated in lords victories. Roger Binny played for team india in first test win at lords in 1986 and his son Stuart Binny played recent test match win at lords against England.
మీ వ్యాఖ్య రాయండి