Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

నన్నెవరు మెచ్చుకోరు, వాళ్లు తప్ప: ఇషాంత్

Posted by:
Published: Wednesday, July 23, 2014, 12:24 [IST]

లండన్: తాను మెరుగ్గా బౌలింగ్ చేసిన చాలా సందర్భాలలో భారత జట్టు సహచరులు మినహా తనను ఎవరూ మెచ్చుకోరని ఇషాంత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సంచలన ప్రదర్శన అనంతరం బిసిసిఐ టీవీతో ఇషాంత్ మాట్లాడాడు. తన కృషిని ఇంతవరకు జట్టులోని తన సహచరులు తప్ప ఎవరు కూడా ప్రశంసించలేదన్నాడు. 2011లో తాను లార్డ్స్‌లో ఆడిన అనుభవం తనకు ఎంతగానో తోడ్పడిందని అతను అన్నాడు.

తన సహచరులు తప్ప ఎవరు కూడా తన కృషిని ప్రశంసించలేదని, తాను ఒక్కోసారి బాధపడుతుంటానని, ఇప్పుడు సైతం తాను ఇన్ని వికెట్లు సాధించబట్టే జనం తనను ప్రశసిస్తున్నారని అన్నాడు. ఒకవేళ తాను గనుక భారీగా పరుగులు ఇచ్చిఉంటే వ్యూహం విఫలమై ఉంటే ఎవరు కూడా పాత బంతితో నేను 80 ఓవర్లకు పైగా బౌల్ చేసిన వాస్తవాన్ని ప్రశంసించి ఉండేవాళ్లు కాదేమో అన్నాడు.

  నన్నెవరు మెచ్చుకోరు, వాళ్లు తప్ప: ఇషాంత్

అయితే తాను ఎవరో తన గురించి అనే మాటలను పట్టించుకునే వాడిని కాదని, జట్టులోని సహచరులకు తన పైన పూర్తి నమ్మకం ఉందనే విషయం తనకు తెలుసునని చెప్పాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగే బంతులతో ఇశాంత్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన అయిన 74 పరుగులకు 7 వికెట్లు పడగొట్టి భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

కాగా, ఇషాంత్ శర్మ మూడేళ్ల తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్ 20లోకి ప్రవేశించాడు. అతను మూడు ర్యాంకులు ఎగబాకాడు. అశ్విన్ 11వ స్థానంలో, భువనేశ్వర్ 34వ స్థానంలో ఉన్నారు. బ్యాట్సుమెన్‌లలో మురళీ విజయ్ 19, రహానే 35, పుజారా 8, కోహ్లీ 14 స్థానాలలో ఉన్నారు.

English summary
"Sometimes, I feel like my efforts are never appreciated by people other than my team-mates. Even today, because I got all these wickets, people are praising me," Sharma said after India notched up a historic 95-run win over England in the second Test yesterday (July 21).
మీ వ్యాఖ్య రాయండి