Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టినోను కొడితే బాగుండేది: మాలిక్‌పై సానియా

Updated: Saturday, July 26, 2014, 12:02 [IST]

న్యూఢిల్లీ: తన భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన పూర్తి మద్దతు ప్రకటించింది. వెస్టిండీస్ పేసర్ టినో బెస్ట్‌ను అతను కొట్టివుంటే బాగుండేదని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది.

కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సిపిఎల్)లో బార్బడోస్ ట్రైటెంట్స్, సెయింట్ లూసియా జుక్స్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా టినో బెస్ట్, షోయబ్ మాలిక్ మధ్య వివాదం చోటు చేసకుంది. లూసియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న షోయబ్ 48 పరుగులు చేయడమేగాక, డ్వేయిన్ స్మిత్ (110 నాటౌట్)తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించాడు.

టినోను కొడితే బాగుండేది: మాలిక్‌పై సానియా

కాగా, మ్యాచ్ జరుగుతున్న సమయంలో బెస్ట్, షోయబ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ పరస్పరం దాడులకు దిగే పరిస్థితి తలెత్తింది.

మిగతా ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకోవడంతో ఇద్దరూ కొట్టుకునే ప్రమాదం తప్పింది. ఈ సంఘటనపై సానియా స్పందిస్తూ.. షోయబ్ అతనిని కొడితే బాగుండేదంటూ ట్వీట్ చేసింది. టినోను మూర్ఖుడిగా అభివర్ణించింది. కాగా, సానియా ఈ విధంగా ట్వీట్ చేయడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మైదానంతో పాటు హోటల్ వద్ద టినోతో గొడవ పడినందుకు షోయబ్ మాలిక్‌కు జరిమానా విధించారు. అతని మ్యాచ్ ఫీజులో 60శాతం కోతవేశారు.

Story first published:  Saturday, July 26, 2014, 11:51 [IST]
English summary
Indian tennis star Sania Mirza made no reservations in showing support for husband Shoaib Malik. Sania Mirza tweeted that she wished Shoaib had hit Tino when the two players nearly came to blows at the Kensington Oval in a T20 match between Barbados Tridents and St. Lucia Zouks.
మీ వ్యాఖ్య రాయండి