Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

మరో చెత్త రికార్డు చేరువలో కెప్టెన్ ధోనీ

Published: Monday, August 11, 2014, 13:20 [IST]

మాంచెస్టర్: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో చెత్త రికార్డుకు చేరవయ్యాడు. అంతర్జాతీయంగా అతి ఎక్కువ టెస్టు మ్యాచులు ఓడిన కెప్టెన్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీకి త్వరలోనే చోటు దక్కనుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచులో ఓటమితో కెప్టెన్ ధోనీ ఖాతాలో ఇప్పటికే 13 టెస్ట్ ఓటములు నమోదయ్యాయి.

మరో మూడు ఓటములు మూటగట్టుకుంటే ధోనీ తన పేరున ఓ చెత్త రికార్డును లిఖించుకునే అవకాశం దక్కనుంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియన్ లారా పేరిట ఉన్న 16 టెస్ట్ ఓటముల రికార్డుకు ధోనీ కేవలం మరో మూడు టెస్టుల దూరంలోనే ఉన్నాడు.

మరో చెత్త రికార్డు చేరువలో కెప్టెన్ ధోనీ

భారత్ తరపున మన్సూర్ అలీఖాన్ పటౌడీ, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ 10 టెస్ట్ ఓటములతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటీవలి న్యూజిలాండ్ పర్యటనలో ధోనీ ఈ రికార్డును బ్రేక్ చేశాడు.

కాగా, టెస్టుల్లో టీమిండియా తరపున విదేశాల్లో ఎక్కువ మ్యాచులు గెలిపించిన ఘనత బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీదే. భారత్‌ గంగూలీ సారథ్యంలో 11 టెస్టుల్లో విజయాలను అందుకుంది. ఇందులో ఇంగ్లాండ్ (2002), ఆస్ట్రేలియా (2003-04) సిరీస్ డ్రాలు కూడా ఉన్నాయి. గుంగూలీ కెప్టెన్సీలో భారత్ వెస్టిండీస్, జింబాబ్వే, శ్రీలంకల్లో విజయాలు నమోదు చేసింది. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా విదేశాల్లో 27 టెస్టులాడి కేవలం ఆరు టెస్టుల్లో మాత్రమే గెలిచింది.

English summary
Mahendra Singh Dhoni might have forged a formidable coach-captain combination with Stephen Fleming for the CSK in the Indian Premier League but the India captain is on the verge of equalling an ignominous record in possession of the former Black Caps skipper - that of maximum number of away Test defeats while leading his country.
మీ వ్యాఖ్య రాయండి