Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్-ఆస్టేలియా టెస్టు సిరిస్ తాజా షెడ్యూల్, అడిలైడ్‌లో తొలి టెస్టు

Posted by:
Updated: Monday, December 1, 2014, 17:01 [IST]

న్యూఢిల్లీ: ఆస్టేలియా మృతి కారణంతో భారత్ - ఆస్టేలియా టెస్టు సిరిస్‌కు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్టేలియా ప్రకటించింది. దీంతో తొలి టెస్టు‌ను టీమిండియా డిసెంబర్ 9 (మంగళవారం) నుంచి అడిలైడ్‌లో ఆడనుంది.

భారత్-ఆస్టేలియా టెస్టు సిరిస్ తాజా షెడ్యూల్, అడిలైడ్‌లో తొలి టెస్టు

అదే విధంగా రెండవ టెస్టు, నాల్గవ టెస్టు మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేసింది. ఇక ఆస్టేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు డిసెంబర్ 3న జరుగనున్నాయి. బుధవారం మాక్స్‌విల్లేలో జరగనున్న ఫిల్‌ హ్యూస్‌ అంత్యక్రియలకు హాజరుకానున్నాడు.

కోహ్లీతో పాటు భారత జట్టు డైరెక్టర్‌ రవిశాస్త్రి, కోచ్‌ డంకన్‌ ఫ్లెచర్‌, మేనేజర్‌ అర్షద్‌ అయూబ్‌ కూడా అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆస్టేలియా క్రికెట్ తాజాగా ప్రకటించిన షెడ్యూల్‌ను అక్కడి న్యూస్ ఛానల్ ట్వీట్ చేసింది.

తొలి టెస్టు: డిసెంబర్ 9 నుంచి 13 వరకు (అడిలైడ్)
రెండవ టెస్టు: డిసెంబర్ 17 నుంచి 21 వరకు (బ్రిస్‌బేన్)
మూడో టెస్టు: డిసెంబర్ 26 నుంచి 30 వరకు (మెల్‌బోర్న్)
నాల్గవ టెస్టు: జనవరి 6 నుంచి 10 వరకు (సిడ్నీ)

Story first published:  Monday, December 1, 2014, 16:53 [IST]
English summary
The first India-Australia Test, which was postponed, will now be played from December 9 (Tuesday) in Adelaide while the second and fourth Tests have also been rescheduled.
మీ వ్యాఖ్య రాయండి