Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

దాదా పెద్ద మనసు: కేసరి ఫ్యామిలీకి 4.2లక్షలు

Published: Sunday, April 26, 2015, 10:27 [IST]

కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ తన పెద్ద మనసును చాటుకున్నాడు. కోల్‌కతా మైదానంలో గాయపడి మృతిచెందిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి కుటుంబానికి తన ఏడాది పెన్షన్‌ను వితరణగా ప్రకటించాడు.

అంతటితోనే పరిమితం కాకుండా మున్ముందు క్యాబ్ తరపున ఆడే క్రికెటర్లు ఫీల్డ్‌లో గాయపడితే, ఆ ఖర్చులను తన పెన్షన్‌లోంచి అందజేస్తానని తెలిపాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ టెస్ట్ క్రికెటర్లకు ఏడాదికి రూ. 4.20 లక్షలను పెన్షన్‌గా అందజేస్తున్న విషయం తెలిసిందే. క్యాబ్ కూడా కేసరి కుటుంబానికి రూ. 10 లక్షల సహాయాన్ని ప్రకటించింది.

 Sourav Ganguly gives away his BCCI pension to Ankit Keshri's family

కొత్త కోచ్ ఎవరు?: బిసిసిఐ సమావేశంలో చర్చ

కోల్‌కతా: టీమిండియా కొత్త కోచ్ ఎవరే అంశంపై ఆదివారం ఇక్కడ జరిగే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలక మండలిలో చర్చించనున్నారు. అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ విలువను కేవలం 5 లక్షల రూపాయలుగా చూపించడాన్ని కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.

వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌తోనే కోచ్ డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్టు ముగిసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త కోచ్ కోసం వెతుకులాట ఆరంభమైంది. మాజీ కెప్టెన్లు రవి శాస్ర్తి, సౌరవ్ గంగూలీ పేర్లు షికార్లు చేస్తున్నాయ. కాగా, బోర్డు ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ఎసియు) చీఫ్ కన్స ల్టెంట్‌గా నీరజ్ కుమార్ ఎంపికను ఈ సమావేశం ఖాయం చేస్తుంది.

English summary
Former India captain Sourav ​Ganguly has decided to give away his BCCI pension for this year to the deceased Under-19 Bengal cricketer Ankit Keshri's family.
మీ వ్యాఖ్య రాయండి