Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

యువరాజ్‌కు డిడి కెప్టెన్ డుమిని మద్దతు

Published: Monday, April 27, 2015, 15:13 [IST]

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆ స్థాయిలో రాణించకపోవడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ జెపి డుమిని మాత్రం యువీకి మద్దతుగా నిలిచాడు. తర్వాతి మ్యాచుల్లో యువీ బాగా ఆడతాడని చెప్పాడు.

ఢిల్లీ యాజమాన్యం యువరాజ్ సింగ్‌ను రూ. 16కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతను మాత్రం కేవలం ఒకే అర్థ సెంచరీ నమోదు చేసి మొత్తం 124 పరుగులు చేశాడు. సగటు పరిశీలిస్తే 17.71గా ఉంది. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచులో ఐదు బంతులు ఆడిన యువరాజ్ సింగ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచులో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో బెంగళూరు చేతిలో ఓడిపోయింది.

ఒకసారి పరుగులేమి చేయనంత మాత్రాన ఒక ఆటగాడ్ని తక్కువ అంచనా వేయొద్దని అన్నాడు. జట్టులో ఒక ఆటగాడ్ని బాధ్యుడ్ని చేయడం సరికాదన్నారు. కాగా, ఢిల్లీ ఆడిన ఏడు మ్యాచుల్లో నాలుగు ఓటములు నమోదు చేసింది.

DD skipper JP Duminy backs struggling Yuvraj Singh

‘అతడ్ని(యువీ) విమర్శించడం చాలా తేలిక. అతను రాణించేందుకు మంచి అవకాశాలు దొరకడం లేదు. అతను జట్టును గెలిపించాలనే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాడు. అయితే అతని ఒక్కడి వల్ల అది సాధ్యం కాదు' అని డుమిని చెప్పాడు.

‘మా జట్టులో అతడు(యువరాజ్) విధ్వంసకర ఆటగాడు. టోర్నీలోని మిగితా మ్యాచుల్లో అతని ప్రదర్శన చాలా బాగుంటుందనే నమ్ముతున్నాను' ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు తెలిపాడు. ఈ ఐపిఎల్‌లో డుమిని 222 పరుగులు చేశాడు.

‘నాకు తెలిసి జహీర్ ఖాన్ 95శాతం నమ్మకమైన బౌలర్. అతని ప్రొగ్రెస్ చాలా బాగుంది. అతడు అతి త్వరలో ఢిల్లీకి ఆడతాడని నమ్ముతున్నాను' అని డుమిని తెలిపాడు. ‘ఇప్పటి ఆడిన మ్యాచుల నుంచి చాలా నేర్చుకున్నాం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మంచి ఆటగాళ్లున్నారు. కొంచెం శ్రమిస్తే విజయాలు వరిస్తాయి' అని చెప్పాడు. అవసరమైతే జట్టు కూర్పులో స్వల్ప మార్పులు చేస్తామని తెలిపాడు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మరో మ్యాచ్ ఆడనున్నామనీ, ఆ మ్యాచులో తమ సత్తా చాటుతామని డుమిని తెలిపాడు.

English summary
The costliest buy this season, Yuvraj Singh has not set the IPL ablaze the way he was expected to but his Delhi Daredevils captain J P Duminy has backed the star player to come good in the later stages of the T20 league.
మీ వ్యాఖ్య రాయండి