Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అర్జున అవార్డు సిఫార్సు: గర్వంగా ఉందన్న రోహిత్

Published: Monday, April 27, 2015, 16:34 [IST]

న్యూఢిల్లీ: అర్జున అవార్డుకు సిఫార్సు చేయాలన్న నిర్ణయంపై భారత ఆటగాడు రోహిత్ శర్మ స్పందించాడు. తనకు ఈ విషయం విన్న తర్వాత చాలా సంతోషం కలిగిందని చెప్పాడు. రోహిత్‌ శర్మ పేరును అర్జున అవార్డు (2015)కు ప్రతిపాదించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదివారం నిర్ణయించింది.

ఆదివారం కోల్‌కతా జరిగిన సమావేశంలో రోహిత్ శర్మ పేరును అర్జున అవార్డుకు ప్రతిపాదించాలని బిసిసిఐ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. కాగా, బిసిసిఐ తనను అర్జున అవార్డు కోసం సిఫార్సు చేయడం పట్ల రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. ఆదివారం ఈ విషయం తనకు తెలిసిందని, ఎంతో సంతోషించానని తెలిపాడు.

  న్యూఢిల్లీ: అర్జున అవార్డుకు సిఫార్సు చేయాలన్న నిర్ణయంపై భారత ఆటగాడు రోహిత్ శర్మ స్పందించాడు. తనకు ఈ విషయం విన్న తర్వాత చాలా సంతోషం కలిగిందని చెప్పాడు. రోహిత్‌ శర్మ పేరును అర్జున అవార్డు (2015)కు ప్రతిపాదించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదివారం నిర్ణయించింది.  ఆదివారం కోల్‌కతా జరిగిన సమావేశంలో రోహిత్ శర్మ పేరును అర్జున అవార్డుకు ప్రతిపాదించాలని బిసిసిఐ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. కాగా, బిసిసిఐ తనను అర్జున అవార్డు కోసం సిఫార్సు చేయడం పట్ల రోహిత్ శర్మ ఆనందం  వ్యక్తం చేశాడు. తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. ఆదివారం ఈ విషయం తనకు తెలిసిందని, ఎంతో సంతోషించానని తెలిపాడు.   ఈ 27ఏళ్ల ముంబై ఆటగాడు చివరిసారిగా శ్రీలంకపై 264 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈడెన్ గార్డెన్‌లో జరిగిన అంతర్జాతీయ మ్యాచులో రోహిత్ ఈ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కాగా, వన్డేల్లో రెండు డబుల్‌ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్‌ చర్రితకెక్కాడు.   ప్రస్తుతం ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఏప్రిల్ 25న జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తమ జట్టు సభ్యులందరూ సమష్టిగా రాణించారని చెప్పాడు. తమ జట్టు బ్యాటింగ్ బాగా చేసిందని, అదే విధంగా బౌలర్లు కూడా ఉత్తమంగా రాణించడంతో జట్టు గెలుపు సులభమైందని చెప్పాడు. తమ జట్టులో ప్రతిభ గల ఆటగాళ్లున్నారని తెలిపాడు.

ఈ 27ఏళ్ల ముంబై ఆటగాడు చివరిసారిగా శ్రీలంకపై 264 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈడెన్ గార్డెన్‌లో జరిగిన అంతర్జాతీయ మ్యాచులో రోహిత్ ఈ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కాగా, వన్డేల్లో రెండు డబుల్‌ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్‌ చర్రితకెక్కాడు.

ప్రస్తుతం ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఏప్రిల్ 25న జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తమ జట్టు సభ్యులందరూ సమష్టిగా రాణించారని చెప్పాడు. తమ జట్టు బ్యాటింగ్ బాగా చేసిందని, అదే విధంగా బౌలర్లు కూడా ఉత్తమంగా రాణించడంతో జట్టు గెలుపు సులభమైందని చెప్పాడు. తమ జట్టులో ప్రతిభ గల ఆటగాళ్లున్నారని తెలిపాడు.

English summary
Indian batsman Rohit Sharma on Monday expressed delight about the BCCI's decision to recommend his name for the government's prestigious Arjuna Award and said that he felt "honoured".
మీ వ్యాఖ్య రాయండి