Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

క్రికెట్ షాక్: పోటీగా మరో సంస్థ! ఐసీసీ విచారణ

Posted by:
Published: Monday, April 27, 2015, 14:35 [IST]

న్యూఢిల్లీ: ఐసీసీకి సమాంతరంగా మరో క్రికెట్ వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఊహాగానాల నేపథ్యంలో.. ఐసీసీ దీనిపై విచారణ జరుపుతోందని తెలుస్తోంది. ఐసీసీకి సమాంతరంగా మరో క్రికెట్‌ వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశం ఐసీసీకి ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల కొన్ని పరిణామాల నేపథ్యంలో ఈ తిరుగుబాటు సంస్థపై అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులను ఐసీసీ అప్రమత్తం చేసింది. ప్రముఖ మీడియా వ్యాపారి సుభాశ్‌ చంద్ర, ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోడీతో చేతులు కలిపినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 The ICC has launched an investigation into the possibility of a rival global organisation

ఐసీసీ గుత్తాధిపత్యం నుంచి ప్రపంచ క్రికెట్‌ను తప్పించడానికి తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ పరిణామం చోటు చేసుకుందని అంటున్నారు. జాతీయ క్రికెట్‌ బోర్డుల పేర్లను తలపించేలా కంపెనీల పేర్లు నమోదవుతుండడం ప్రపంచ క్రికెట్లో కలకలం రేపుతోంది.

ఈ నేపథ్యంలో ఐసీసీ ఇటీవల దుబాయ్‌లో అత్యవసరంగా సమావేశమైంది. ఆస్ట్రేలియా క్రికెట్‌ కంట్రోల్‌ లిమిటెడ్‌ పేరుతో ఎస్సెల్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ కంపెనీని నమోదు చేయించడంపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ గ్రూపు న్యూజిలాండ్‌ క్రికెట్‌ లిమిటెడ్‌, కివి క్రికెట్‌ లిమిటెడ్‌, ఒతీరోరా క్రికెట్‌ లిమెటెడ్‌ పేర్లతో మరో మూడు కంపెనీలనూ నమోదు చేయించింది. మరోవైపు, ఎస్సెల్‌ గ్రూపు ప్రయత్నాల్లో తన ప్రమేయం ఉన్న విషయాన్ని లలిత్ మోడీ కొట్టి పారేసినట్లుగా తెలుస్తోంది.

English summary
The International Cricket Council has launched an investigation into the possibility of a rival global organisation.
మీ వ్యాఖ్య రాయండి