Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

శ్రీనివాసన్‌కి అనురాగ్ చురక, ఇంట్లో వాళ్లకూ చెప్పు

Posted by:
Published: Tuesday, April 28, 2015, 12:51 [IST]

న్యూఢిల్లీ: తనకు బుకీతో సంబధాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తల పైన బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సోమవారం ఖండించారు. ఆయన శ్రీనివాసన్ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. అనుమానిత బుకీల లిస్ట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఐసీసీ ఛైర్మన్‌ ఎన్ శ్రీనివాసన్‌ అభీష్టానికి వ్యతిరేకంగా తాను బోర్డు కార్యదర్శి కావడం వల్లే, తనకు బుకీతో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని అనురాగ్‌ మండిపడ్డారు. అతను శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఘాటైన బహిరంగ లేఖ రాశారు.

అనుమానాస్పద బుకీలకు సంబంధించిన సమాచారాన్ని శ్రీనివాసన్‌ బీసీసీఐలోని సభ్యులందరికీ ఇవ్వాల్సిందన్నాడు. పనిలో పనిగా ఆ సమాచారాన్ని బెట్టింగ్‌ చేసినట్లు రుజువైన తన కుటుంబ సభ్యులతోనూ (శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మయప్పన్‌ను ఉద్దేశించి) పంచుకోవాల్సిందని, శ్రీని అల్లుడు మీయప్పన్‌ను ఉద్దేశించి చురక అంటించాడు.

Anurag Thakur hits back at N Srinivasan, asks him to share list of suspected bookies

బుకీగా అనుమానాలున్న కరణ్‌ గిల్హోత్రాకు తాను దూరంగా ఉండాలంటూ ఐసీసీ నుంచి బీసీసీఐకి సూచన వచ్చిందని, ఐతే తాము చెబుతున్నది ధ్రువీకరించని సమాచారమని కూడా ఐసీసీ పేర్కొందని చెప్పారు. ఐతే తానింతకు ముందు శ్రీనివాసన్ అధ్యక్షతన బీసీసీఐ కార్యదర్శిగా పని చేశానని, ఇలాంటి అనుమానాస్పద బుకీల గురించి తనతో పాటు అందరికీ చెప్పి ఉండే బాగుండేదన్నారు.

మాతో పాటు బెట్టింగుతో సంబంధమున్నట్లు నిర్ధారణ అయిన మీ కుటుంబ సభ్యులకు కూడా వివవరాలివ్వాలన్నారు. కరణ్ తనకు తెలుసునని, పంజాబ్ రాజకీయాల్లో, క్రికెట్ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటాడని, కానీ అతనో అనుమానాస్పద బుకీ అని తనకు తెలియదన్నాడు.

దీనిపై శ్రీనివాసన్ మాట్లాడుతూ.. అనురాగ్ రాసిన లేఖ గురించి మీడియాలో చదివానని, అందులో అతనేదో రాశాడని, దాని గురించి మీడియా ద్వారా స్పందించడం సరికాదని, ఏదైనా ఉంటే అనురాగ్‌కు వ్యక్తిగతంగా లేఖ రాస్తానని చెప్పారు.

English summary
Anurag Thakur hits back at N Srinivasan, asks him to share list of suspected bookies
మీ వ్యాఖ్య రాయండి