Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సౌరభ్ గంగూలీపై పుస్తకం: కెప్టెన్సీ, వివాదాలపై విశ్లేషణ

Posted by:
Published: Tuesday, April 28, 2015, 15:34 [IST]

కోల్‌కత్తా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవిత విశేషాలతో పాటు క్రికెట్‌తో గంగూలీకి ఉన్న అనుబంధాన్ని తెలిపే పుస్తకం ఒకటి త్వరలో మార్కెట్లోకి రానుంది. ఈ పుస్తకాన్ని గంగూలీకి డైహార్డ్ ఫ్యాన్ అయిన సప్తర్షి సర్కార్ రాశారు. 'సౌరభ్ గంగూలీ: క్రికెట్, కెప్టెన్సీ అండ్ కాంట్రవర్సీ' అనే పేరుతో ఈ పుస్తకం త్వరలో మార్కెట్లోకి విడుదలైంది.

'కోల్‌కత్తా ప్రిన్స్' గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే సౌరభ్ గంగూలీ జీవిత విశేషాలతో పాటు, క్రికెటర్‌గా, టీమిండియా కెప్టెన్‌గా ఎలా రాణించారనే వివిధ కోణాలను ఈ పుస్తకంలో విశ్లేషించారు. పుస్తకం విడుదలపై సర్కార్ మాట్లాడుతూ మనిషికి, క్రికెటర్‌కి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపేది ఈ పుస్తకమని అన్నారు. welovesourav.com అనే వెబ్‌సైట్‌ను రన్ చేసే నాకు కొంత మంది సన్నిహితులు దాదా గురించి ఒక పుస్తకం రాయమని కోరారు.

Read about Ganguly's captaincy and controversies in new book

నా వద్ద దాదా గురించి పూర్తి సమాచారం ఉండటంతో ఈ పుస్తకాన్ని రాసేందుకు సిద్దమయ్యానని పేర్కొన్నాడు. ఈ పుస్తకంలో టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ వ్యవహారంతో పాటు, మరెన్నో కాంట్రవర్సీ‌లు ఉన్నాయని తెలిపాడు. ఈ పుస్తకాన్ని (ఏప్రిల్ 27)న గంగూలీ చిన్ననాటి కోచ్ అశోక్ ముస్తాఫీ, మాజీ క్రికెటర్ రాజు ముఖర్జీ, మాజీ బెంగాల్ క్రికెటర్ గోపాల్ బసు సమక్షంలో విడుదల చేశారు.

బిజీ షెడ్యూల్ మూలంగా ఈ పుస్తక కార్యక్రమానికి సౌరభ గంగూలీ మాత్రం హాజరుకాలేదు.

English summary
A book recounting former Indian captain Sourav Ganguly's incident-filled cricket career has been unveiled here.
మీ వ్యాఖ్య రాయండి