Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

చెన్నైకి దెబ్బ: చేతి గాయంతో అశ్విన్ దూరం

Published: Wednesday, April 29, 2015, 13:32 [IST]

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. భారత ఆఫ్ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవించంద్రన్ అశ్విన్ చేతి గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో తదుపరి రెండు మ్యాచులకు దూరమయ్యాడు.

మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచులో అశ్విన్‌ చేతికి గాయమైంది. దీంతో అతడు తర్వాతి రెండు మ్యాచులకు దూరంగా ఉండనున్నాడు.

Ravichandran Ashwin suffers hand injury, to skip CSK's next 2 matches

‘అశ్విన్ మధ్య వేలికి(చీలిక పడింది) తీవ్రగాయమైంది. ఎన్ని కుట్లు పడతాయో తెలియదు. అతడ్ని ఆస్పత్రికి తరలించాం. చెన్నై తర్వాతి రెండు మ్యాచులకు అశ్విన్ దూరంగా ఉంటాడు' అని చెన్నై టీం మేనేజర్ రస్సెల్ రాధాకృష్ణన్ తెలిపారు.

ఆదివారం జరిగిన మ్యాచులో కేవలం 2 పరుగులతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై చెన్నై సూపర్ గెలిచింది. చెన్నై 134 పరుగుల స్వల్ప లక్ష్యంతోనే కోల్‌కతాను కట్టడి చేసి విజయం సాధించింది. 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసిన కోల్‌కతా 2 పరుగుల తేడాతో ఓడిపోయింది.

English summary
Indian off-spinner Ravichandran Ashwin has been ruled out of the next two IPL matches due to a hand injury which he suffered during Tuesday's match between Chennai Super Kings and Kolkata Knight Riders.
మీ వ్యాఖ్య రాయండి