Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

చెన్నైతో ఢీ: వారిపై హైద్రాబాద్ నజర్ (పిక్చర్స్)

Posted by:
Published: Friday, May 1, 2015, 10:48 [IST]

హైదరాబాద్: ఐపీఎల్ 8లో సగం మ్యాచులు పూర్తి అయ్యేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచులు ఆడి మూడింట గెలిచి నాలుగు ఓడింది. ఆరు పాయింట్లతో ఉంది.

ఇప్పుడు సొంత గడ్డ పైన సవాల్‌కు సన్ రైజర్స్ సిద్ధమవుతోంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. చెన్నై 8 మ్యాచులు ఆడి, ఆరింట గెలిచి పన్నెండు పాయింట్లతో ఉంది.

సన్ రైజర్స్ హైదరాబాద్

గురువారం నాడు ఉప్పల్ స్టేడియంలో, చీఫ్ కోచ్ టామ్ మూడీ, బౌలింగ్ కోచ్ మురళీధరన్, మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో సన్ రైజర్స్ ఆటగాళ్లు పాల్గొన్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్

కెప్టెన్ డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, పేసర్లు డెల్ స్టెయిన్, బౌల్ట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. ఇప్పటి దాకా రాణించని విలియమ్సన్, మోర్గాన్, హెన్రిక్స్, నమన్ ఓజాలపై మూడీ ప్రత్యేకంగా దృష్టి సారించారు.

సన్ రైజర్స్ హైదరాబాద్

ఈ నలుగురితో చాలాసేపు సాధాన చేయించాడు. వికెట్ కీపర్ ఓజా ఏడు మ్యాచులు ఆడినా ప్రభావం చూపలేదు. విలియమ్సన్ రెండు మ్యాచులు ఆడి 31 పరుగులే చేశాడు. మోర్గాన్ రెండు మ్యాచుల్లో 28 పరుగులే చేశాడు.

 

సన్ రైజర్స్ హైదరాబాద్

గత మ్యాచులలో భారీ షాట్లు ఆడటానికి ఇబ్బంది పడిన హెన్రిక్స్ నెట్స్‌లో చాలా శ్రమించాడు. చాలాసేపు బ్యాటింగ్ చేశాడు.

 

సన్ రైజర్స్ హైదరాబాద్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పైన చివరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాది నాణ్యమైన ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఆశిష్ రెడ్డి బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.

 

English summary
SUN RISERS TEAM PRACTICE IN UPPAL STADIUM
మీ వ్యాఖ్య రాయండి