Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ముద్దుల కూతురిని ఎత్తుకొని ధోనీ మురిపెం(ఫోటో)

Posted by:
Published: Monday, May 4, 2015, 11:07 [IST]

చెన్నై: భారత జట్టు క్రికెట్ సారథి, ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం నాడు తన భార్య సాక్షి ధోనీ, కూతురు జీవాతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో ముద్దుల కూతురును ఎత్తుకొని ధోనీ మురిసిపోయాడు. కొద్ది రోజులుగా ధోనీ తన కూతురు జీవాతో కలిసి కనిపిస్తున్నాడు.

ధోనీ కూతురు జీవా సెలబ్రిటీ అయిపోతోంది. ప్రతీ రోజూ ఈ నెలల చిన్నారి ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. ఆమె తండ్రి కెప్టెన్ కూల్ ఆమెకు సంబంధించిన ఫొటోలను అప్పుటప్పుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నాడు. తన చేతుల్లో ఎత్తుకొని ఉన్న ఫోటోను కొద్ది రోజుల క్రితం చేశాడు.

Dhoni with his daughter and wife at an event in Chennai

పదిహేను రోజుల క్రితం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో గెలిచిన అనంతరం ధోనీ తన టీం డ్రెస్సింగ్ రూంలో ఆమెతో ఈ ఫొటోను దిగాడు. జీవాతో ధోనీ తన ఆనందాన్ని పంచుకుంటూ దిగిన ఫొటోలు చాలానే ఉన్నాయి. ధోనీ-సాక్షిలకు జీవా తొలి సంతానం. ఆస్ట్రేలియాలో 2015 ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలోనే ఫిబ్రవరిలో జీవా జన్మించింది.

కొద్ది రోజుల క్రితం ధోనీ మాట్లాడుతూ.. ‘జీవా పుట్టినప్పుడు నేను ఇండియాలో లేను. ఆమెను చూడలేకపోయాను. అది నాకు కష్టమైన కాలం' అని ధోనీ చెప్పాడు. ‘నేను నా దేశం తరపున ఆడతున్నాననీ గానీ లేదా చెన్నై లాంటి మంచి ఫ్రాంఛైజీ తరపున ఆడుతున్నాననేది తనకు అవసరం లేదు. ఆమె ఏడవాలనుకుంటే ఏడ్చేస్తుంది. అది నాకు మంచి అనుభూతినిచ్చింది' అని తన ముద్దుల కూతురు గురించి ధోనీ తెలిపాడు.

English summary
Indian cricket team captain Mahendra Singh Dhoni with his daughter and wife Sakshi Dhoni at an event in Chennai on Sunday.
మీ వ్యాఖ్య రాయండి