Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఆ షాట్ ఆడినందుకు బాధఫడ్డ రహానే, రాత్రంతా నిద్రపోలేదు

Posted by:
Published: Monday, May 4, 2015, 13:03 [IST]

బెంగళూరు: ఐపీఎల్ 8లో ముందంజలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టులో అజింక్యా రహానే తన సత్తా చాటుతున్నాడు. 430 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో అందరికంటే ముందు నిలిచాడు. ఆదివారం నాడు ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 91 పరుగులు చేసి రాజస్థాన్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

ఈ సందర్భంగా రహానే మాట్లాడుతూ.. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెత్త షాట్ ఆడినందుకు ఆ రోజు రాత్రి నిద్రపోలేదని రహానే చెప్పాడు. ఈ నెల 1వ తేదీన ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రహానే 16 పరుగుల వద్ద వినయ్ కుమార్ బౌలింగులో క్యాచ్ అవుటయ్యాడు.

http://www.oneindia.com/sports/cricket/i-was-really-hurt-could-not-sleep-reveals-rr-batsman-ajinkya-rahane-1736104.html

చెత్త షాట్ ఆడినందుకు తాను చాలా బాధపడ్డానని, ఆ రోజు రాత్రంతా నిద్రలేకుండా గడిపానని చెప్పాడు. ఆ షాట్ గురించి, జట్టు పరాజయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయానని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో తాను బాగా ఆడనందుకు ఎంతో బాధపడ్డానని చెప్పాడు. ఆరు ఏడు ఓవర్ల తర్వాత తాను 20 ఓవర్ల వరకు ఎలా ఆడాలో ప్లాన్ చేసుకుంటానని చెప్పాడు.

ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచులో 54 బంతుల్లో 2 సిక్స్‌లు, 9 ఫోర్లతో 91 పరుగులు చేశాడు. మరో ఆటగాడు కరణ్ నాయర్ (38 బంతుల్లో 61 పరుగులు) కూడా రాణించాడు. దీంతో రాజస్థాన్ 14 పరుగుల తేడాతో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఢిల్లీ పైన గెలిచింది.

English summary
Left sleepless after the last time he played a bad shot against Mumbai Indians, in-form Rajasthan Royals batsman Ajinkya Rahane said he was desperate to set the record straight which helped him notch up the sublime 91-run knock in an IPL match here.
మీ వ్యాఖ్య రాయండి