Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ట్రాట్

Posted by:
Published: Tuesday, May 5, 2015, 10:38 [IST]

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జోనాథన్ ట్రాట్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మెట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ట్రాట్ ప్రకటించాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లాండ్ టెస్టు జట్టులోకి స్ధానం సంపాదించిన ట్రాట్ ఆశించిన స్ధాయిలో రాణించలేక పోయాడు.

కరేబియన్ దీవుల్లో వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమయ్యాడు. ట్రాట్ ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో 72 పరుగులు, మూడు డకౌట్లుగా ఉన్నాయి. దీంతో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించగల స్దాయిలో తన ఆట తీరులేదని, బాధాకరమైన వైదొలగక తప్పడం లేదని ట్రాట్ పేర్కొన్నట్లు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

Jonathan Trott calls time on England career

ట్రాట్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్, ట్రాట్ ఇంగ్లాండ్ క్రికెట్‌కు అందించిన సేవల గురించి శ్లాఘించారు. 34 ఏళ్ల ట్రాట్ టెస్టు క్రికెట్ యావరేజి 44.08 గా ఉంది. ట్రాట్ తన క్రికెట్ కెరీర్‌లో సాధించిన తొమ్మిది సెంచరీల్లో రెండు సెంచరీలు ఇంగ్లాండ్ జట్టు యాషెస్ సిరిస్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

52 టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన ట్రాట్ 3835 పరుగులు చేశాడు. 69 వన్డేలాడి 2819 పరుగులు చేశాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు పైనల్‌కు వెళ్లడంలో ట్రాట్ కీలక పాత్ర పోషించాడు.

English summary
England batsman Jonathan Trott announced his retirement from international cricket on Monday. Trott struggled for runs on his return to the Test arena during England's 1-1 drawn series with West Indies in the Caribbean concluded Sunday, managing just 72 runs in six innings including three ducks.
మీ వ్యాఖ్య రాయండి