Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

'కోచ్‌గా ఫ్లెచర్ కొనసాగకూడదని అనుకుంటున్నా'

Posted by:
Published: Wednesday, May 6, 2015, 9:02 [IST]

ముంబై: దేశవాళీ ఆటగాళ్ల ఆటతీరును అర్థం చేసుకోవాలంటే టీమిండియా కొత్త కోచ్‌గా స్వదేశీ కోచ్ అయితే బాగుంటుందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్, పాకిస్థాన్ పేస్ లెజెండ్ అక్రమ్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం టీమిండియాకు కోచ్‌గా బాధ్యతులు నిర్వర్తిస్తోన్న డంకన్ ప్లచర్ పదవీకాలం ముగియడంతో అతని స్ధానంలో కొత్త కోచ్‌ను నియమించడానికి బీసీసీఐ కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో వెంగ్ సర్కార్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

మంగళవారం ఓ పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో వెంగ్‌ సర్కార్, అక్రమ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంలో వెంగ్ సర్కార్ మాట్లాడుతూ కోచ్‌గా ఫ్లెచర్ కొనసాగకూడదని అనుకుంటున్నానని అన్నారు. దేశవాళీల్లో, అండర్ -19 క్రికెట్లో ఏం జరుగుతుందో విదేశీ కోచ్‌కు తెలియదని చెప్పుకొచ్చాడు.

Wasim Akram, Dilip Vengsarkar bat for home-grown coach for Indian team

భారత్ క్రికెట్ మీద ఆసక్తి ఉన్నవారికే కోచ్‌గా అవకాశమివ్వాలని కోరాడు. కుర్రాళ్ల ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దే కోచ్ కావాలని తెలిపారు. ఇందుకు గాను విదేశీ కోచ్‌లకు దీనిపై ఆసక్తి ఉంటుందని నేను భావించడం లేదన్నారు.

ఓ విదేశీ కోచ్ ముంబై హోటల్లో ఉంటూ కూడా కిలోమీటర్ దూరంలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న రంజీ ఫైనల్‌కు రాకపోవడం తనకు తెలుసునని అన్నారు. ఇక వసీం అక్రమ్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు కోచింగ్ ఇచ్చిన తరహాలో కాకుండా ప్రతి ఆటగానితో కలుపుకుపోయే తత్వమున్న కోచ్ జట్టుకు అవసరమని అన్నారు.

విదేశీ కోచ్ అయితే అంతర్జాతీయ షెడ్యూల్ లేని సమయంలో దేశవాళీ టోర్నీలను ఏ మాత్రం పట్టించుకోకుండా సెలవులు తీసుకుంటాడని అన్నారు. అదే స్వదేశీ కోచ్ అయితే దేశవాళీ ఆటగాళ్లందరూ అతనికి తెలిసుంటారు. అందుకే ప్రస్తుతం భారత్‌కు స్వదేశీ కోచ్‌ అయితే బాగుంటుందనేది నా అభిప్రాయమని అక్రమ్ అన్నారు.

English summary
With the Indian cricket team currently looking for a coach, Pakistani pace legend Wasim Akram and former India skipper Dilip Vengsarkar batted for a home grown expert for the job, citing their knowledge about domestic cricketers on Tuesday.
మీ వ్యాఖ్య రాయండి