Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఆఫర్ చేస్తే సిద్ధమే: రాహుల్ మనసులో మాట

Published: Thursday, May 7, 2015, 12:03 [IST]

ముంబై: భారత జట్టు కోచ్ పదవిపై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తి ప్రదర్శించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) ఆఫర్ చేస్తే మాత్రం కోచ్ పదవి చేపట్టేందుకు తాను సిద్ధమని ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో రాహుల్ ద్రావిడ్ తన మనసులో మాటను బయటపెట్టాడు.

15ఏళ్లుగా భారత జట్టుకు విదేశీ కోచ్‌లే (జాన్ రైట్, గ్రెగ్ చాపెల్, కిర్‌స్టెన్, ఫ్లెచర్) కొనసాగుతూ వస్తున్నారనీ, అయితే ఈసారి స్వదేశీ వ్యక్తే కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. జట్టు ప్రస్తుత కోచ్ డంకన్ ఫ్లెచర్ కోచ్ పదవీకాలం మేతో ముగియనున్న సంగతి తెలిసిందే.

కాగా, ద్రావిడ్ భారత జట్టు కోచ్‌గా ఉంటే మంచిదని క్రికెట్ నిపుణులు కూడా భావిస్తున్నారు. బ్యాటింగ్ దిగ్గజం, క్రికెట్ మేధావి, సౌమ్యుడు, అందరూ గౌరవించే వ్యక్తి... ఈ అర్హతలన్నీ అతనికి సరిగ్గా సరిపోతాయి. అయితే ఏడాది క్రితం 'కోచ్ పదవి అంటే చాలా బాధ్యతతో కూడుకున్నది. ఏడాదిలో కనీసం 11 నెలలు ఆటకు అంకితం కావాలి. నాకంత సమయం లేదు' అని రాహుల్ చెప్పాడు.

If offered, Rahul Dravid is ready to coach Team India

ఆ తర్వాతైనా కామెంటరీతోనో, ఐపీఎల్‌తోనే అతను క్రికెట్‌తో అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇకపై సమయం అన్నది సమస్య కాకపోవచ్చు. హోదాతో పాటు చెల్లింపులపరంగా చూసినా పైవాటితో పోలిస్తే భారత కోచ్ పదవి ఎంతో కీలకమైంది. ఇప్పుడు అతని తాజా వ్యాఖ్య ఈ పదవిపై ద్రవిడ్ ఆసక్తిని సూచిస్తోంది.

'ఇప్పుడే భారత కోచ్ పదవి గురించి ఆలోచించడం లేదు. అయితే నా దాకా వస్తే ఆలోచిద్దాం. ఎందుకంటే వంతెన దగ్గరకు వెళ్లాకే ఎలా దాటాలో ఆలోచించడం నా నైజం' అని తన ఇష్టాన్ని చూచాయగా చెప్పాడు. మరో వైపు భారత క్రికెట్ సలహాదారులుగా ఉండాలంటూ బోర్డు ద్రావిడ్‌తో పాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలకు కూడా విజ్ఞప్తి చేసింది.

కోచ్‌ను ఎంపిక చేసే కమిటీలో కూడా వీరున్నారు. అయితే బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నోటిమాటగా చెప్పడం తప్ప దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు లేవు. ద్రావిడ్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. కాబట్టి 'సలహాదారు' ఆలోచననుంచి బయటికి వచ్చి పూర్తి స్థాయి కోచ్ కావడాన్నే అతను ఇష్టపడుతున్నట్లు సమాచారం. కాగా, మే నెలాఖరులోగా కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.

English summary
Current coach of Team India, Duncan Fletcher is set to complete his tenure in May. Because of this, speculations about the new coach have started to gain momentum. Names like Sourav Ganguly, Sachin Tendulkar, Ravi Shastri and Rahul Dravid are supposedly being considered.
మీ వ్యాఖ్య రాయండి