Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఫ్రాంచైజీలకి షాకే:ఆడకున్నాజీతం, షమీకి 2.12కోట్లు

Posted by:
Updated: Thursday, May 7, 2015, 15:12 [IST]

బెంగళూరు: ఆటగాళ్లు ఇంజ్యూర్ అయి ఆడకపోయినప్పటికీ వారికి సగం డబ్బులు ఇస్తారు. ఫ్రాంఛైజీకి ఎంపికైన తర్వాత జట్టు శిబిరానికి హాజరు అయితే.. ఆ తర్వాత ఆటగాడు గాయపడి ఒక్క మ్యాచ్‌ ఆడకపోయినా అతడికి రావాల్సిన ఏడాది ఫీజులో సగాన్ని ఫ్రాంఛైజీలు చెల్లించాలి.

కనీసం ఒక్కటైనా, అది ప్రాక్టీస్‌ మ్యాచైనా ఆడి, ఆ తర్వాత గాయపడితే అతడికి మొత్తం ఫీజు ఇవ్వాల్సిందే. ఢిల్లీ డేర్ డెవిల్స్‌ రూ. 4.25 కోట్లు వెచ్చించి వేలంలో మహ్మద్‌ షమిని సొంతం చేసుకుంది. ప్రపంచ కప్‌లో మోకాలి గాయంతో ఇబ్బంది పడిన షమి.. ఐపీఎల్8కు ముందు జట్టు నిర్వహించిన శిబిరానికి హాజరయ్యాడు.

IPL 8: Injured players entittled to get 50 percent of salary

గాయం తిరగబెట్టడంతో ఒక్క మ్యాచైనా ఆడకుండానే టోర్నీకి దూరమయ్యాడు. అయినా ఫ్రాంఛైజీ షమీకి రూ.2.12 కోట్లు చెల్లించాల్సిందే. ఫ్రాంఛైజీలకు మరో అవకాశం లేదని, నిబంధనలు మారతాయని అనుకోవట్లేదని బీసీసీఐ అధికారి చెప్పాడు.

తద్వారా, ఐపీఎల్లో ఆటగాళ్లకు అనుకూలంగా ఉన్న నిబంధనలు ఫ్రాంచైజీలకు కాస్త ఖరీదైన కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. గాయం కారణంగా కనీసం ఒక్క మ్యాచ్‌లోనూ బరిలోకి దిగని ఆటగాడికి కూడా యాభై శాతం జీతం ఇవ్వాలన్న నిబంధన ఫ్రాంచైజీల ను ఇబ్బందికి గురిచేస్తోంది.

Story first published:  Thursday, May 7, 2015, 9:10 [IST]
English summary
The rules of the cash-rich Indian Premier League are quite player-friendly but sometimes they put franchises in a spot as teams have to make payment to even those players, who are reporting injured to the team camps.
మీ వ్యాఖ్య రాయండి