Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

స్టీవ్ వాను కొట్టాలని అనుకున్నా: ఆంబ్రోస్

Posted by:
Published: Friday, May 8, 2015, 13:17 [IST]

సెడార్ గ్రోవ్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వాను నాటి వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ కర్ట్‌లీ అంబ్రోస్ కొట్టాలనుకున్నాడట. 1995లో జరిగిన ఓ టెస్ట్ సందర్భంగా జరిగిన గొడవను ఆంబ్రోస్ ప్రస్తావించాడు. తాను సహనం కోల్పోయానని, అప్పుడు స్టీవ్ వాను కొట్టాలన్నంత కోపం వచ్చిందని తన ఆత్మకథలో ఆంబ్రోస్ తన ఆత్మకథలో రాశాడు.

ఆ మ్యాచ్‌లో స్టీవ్ వా బెదిరిపోయేలా తాను భీకరమైన బౌన్సర్లు సంధించి ఎలా ఉందన్నట్టుగా కనుబొమ్మలు ఎగిరేశానని, అప్పుడు స్టీవ్ వా ఘాటుగా ఏవో దుర్భాషలాడాడని చెప్పాడు. ఎందుకు ఆ మాటలన్నావు అని స్టీవ్ వాని తాను అడిగినట్లు చెప్పాడు.

Wanted to knock Steve Waugh out: Curtly Ambrose

అప్పుడు అతను నేను ఏం అనాలనుకుంటే అదంటానని చెప్పాడని, ఆ వ్యాఖ్యలతో తన కోపం తారాస్థాయికి చేరిందని అన్నాడు. "నా చేతిలో దెబ్బలు తింటావ్. నా కెరీర్ ఇక్కడితో ముగిసినా పట్టించుకోను" అని తాను హెచ్చరించినట్లు తెలిపాడు.

అప్పుడు రిచీ రిచర్డ్‌సన్ జోక్యంతో శాంతించానని తన పుస్తకంలో అంబ్రోస్ రాసుకున్నాడు. రిచీ రిచర్డ్సన్ అప్పుడు మంచి పనిచేశాడని అన్నాడు. 

English summary
West Indian fast bowling legend Curtly Ambrose has revealed the story about his infamous on-field spat with Steve Waugh in 1995, during which he says he came close to trying to "knock out" the Australian batsman.
మీ వ్యాఖ్య రాయండి