Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఉత్కంఠ: పంజాబ్‌పై కోల్‌కతా ఒక్క వికెట్‌తో విజయం

Posted by:
Updated: Saturday, May 9, 2015, 19:50 [IST]

కోల్‌కతా: ఐపియల్ ట్వంటీ20 పోటీల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ అతి కష్టం మీద విజయం సాధించింది. 183 పరుగల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఒక బంతి మాత్రమే మిగిల్చుకుని ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.

నరైన్ లెగ్ బై పరుగుతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా అగ్రస్థానానికి చేరుకుంది. మిడిల్ ఆర్డర్‌లో రసెల్ ధాటిగా ఆడి 21 బంతుల్లో 51 పరుగులు చేయడంతో కోల్‌కతా విజయం సాధ్యమైంది. ఊతప్ప (17 పరుగులు), కెప్టెన్ గౌతం గంభీర్ (24) ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పటికీ ఎక్కువ సేపు నిలదొక్కులేకపోయారు.

183 పరుగులతో స్కోరును సమం చేసిన స్థితిలో పియూష్ చావ్లా తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత నరైన్, ఉమేష్ యాదవ్ బ్యాటింగ్‌కు దిగారు. ఉమేష్ యాదవ్ ఒక్క బంతి కూడా ఆడలేదు. నరైన్ మాత్రం లెగ్ బైతో నెట్టుకొచ్చాడు. దీంతో విజయం చేకూరింది.

పంజాబ్ బౌలర్లలో గుర్‌కీరత్ సింగ్, అనురీత్ సింగ్ రెండేసి వికెట్లు తీసుకోగా, హెన్రిక్స్, అక్షర్ పటేల్, మాక్స్‌వెల్‌లకు తలో వికెట్ లభించింది.

కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ధాటిగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 183 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్ నరైన్ ఒకే ఓవరులో రెండు వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు విఫలమవుతూ వచ్చిన మాక్స్‌వెల్ ఈ మ్యాచులో ధాటిగా ఆడాడు. అతను 22 బంతుల్లో 43 పరుగులు చేశాడు.

IPL 2015 Match 44: KXIP post 183/5; Narine takes 4

మురళీ విజయ్ (28), వోహ్రా (39) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఊప తగ్గకుండా పంజాబ్ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేశారు. వృద్ధిమాన్ సాహా 25 బంతుల్లో 33 పరుగులు చేశాడు. చివరలో మిల్లర్ అదరగొట్టాడు. 11 బంతుల్లో 27 పరుగులు చేశాడు.

కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ నాలుగు వికెట్లు తీశాడు. రస్సెల్ ఒక్క వికెట్ తీశాడు. మిగతా బౌలర్లకు వికెట్లు లభించలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగు ఈ మ్యాచులో తీసికట్టుగా ఉంది. ఐదు క్యాచ్‌లను జార విడిచారు. నరైన్ తప్ప మిగతా బౌలర్లు ఎవరూ రాణించలేదు.

Story first published:  Saturday, May 9, 2015, 17:56 [IST]
English summary
Kings XI Punjab (KXIP) captain George Bailey won the toss and elected to bat first against Kolkata Knight Riders (KKR) in Match 44 of the Indian Premier League 2015 (IPL 8) here today at Eden Gardens
మీ వ్యాఖ్య రాయండి