Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

డిసెంబర్‌లో ఇండో-పాక్ సిరిస్‌కు సన్నాహాలు..!

Posted by:
Published: Monday, May 11, 2015, 15:55 [IST]

ముంబై: సుదీర్ఘ విరామం తర్వాత దాయాది దేశాలైన భారత్, పాకిస్ధాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరిస్ జరగనుంది. ఇందుకు గాను భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందడమే ఆలస్యం. పాకిస్ధాన్ హోం సిరిస్‌గా భావించే ఈ సిరిస్‌లో టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీట్వంటీ మ్యాచ్‌లు ఆడనుంది.

ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ సిరిస్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాకిస్ధాన్ ఈ సిరిస్‌ని తటస్ధ వేదికైన యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించనుంది. పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్యార్ ఖాన్, బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహాన్ దాల్మియాతో సమావేశమైన అనంతరం మీడియాతో ఈ సిరిస్ గురించి వెల్లడించారు.

India to take on Pakistan in a full series in December

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇండో-పాక్ సిరిస్‌ని తిరిగి నిర్వహించాల్సిందిగా దాల్మియాను విజ్ఞప్తి చేశామన్నారు. ఇండో-పాక్ క్రికెట్‌కు ఇదొ కొత్త నాంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ సిరిస్‌లో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీ20లు ఉంటాయని అన్నారు.

ఈ సిరిస్ నిర్వహణకు బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఐపీఎల్ లో ఆడేందుకు పాక్ క్రికెటర్లను అనుమతించాలని పీసీబీ చీఫ్ దాల్మియాను కోరారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల అనంతరం భారత్, పాక్ మధ్య క్రీడా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

English summary
India are set to play a full series against Pakistan in the UAE, provided the team get the clearance from the Indian government. India will play three Tests, five ODIs and two T20Is in December in what will be a home series for Pakistan.
మీ వ్యాఖ్య రాయండి