Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఐపీఎల్‌ మ్యాచ్‌లపై పాక్‌లో బెట్టింగ్: 6గురి అరెస్టు

Posted by:
Published: Monday, May 11, 2015, 18:59 [IST]

ముంబై: భారత్‌లో జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8వ ఎడిషన్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కి పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను పాకిస్ధాన్ పోలీసులు అరెస్టు చేశారు. పక్కాగా సమాచారం అందుకున్న పాకిస్ధాన్ పోలీసులు ఘజియాబాద్ ప్రాంతంలో ఓ ఇంటిని సోదా చేసి బెట్టింగ్‌కి పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

IPL 2015: Six people arrested for betting in Pakistan

వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, ఓ ల్యాప్ ట్యాప్, నగదు, కస్టమర్ల వివరాలతో కూడిన రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో భారత్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి లాహోర్ కేంద్రంగా పాకిస్ధాన్‌లోని పలు నగరాల్లో జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు పాకిస్ధాన్‌లోని లాహోర్‌లో లక్షల్లో నగదు చేతులు మారినట్లు పోలీసులు వెల్లడించారు. ఇది ఇలా ఉంటే న్యూఢిల్లీలో ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఇద్దరు హవాలా ఏజెంట్లను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Six persons have been arrested in Pakistan for allegedly betting on Indian Premier League (IPL) matches. A police team raided a house in Lahore’s Ghaziabad area yesterday following a tip-off and arrested the six persons, police spokesman Niyab Haider.
మీ వ్యాఖ్య రాయండి