Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అన్ని డబ్బులివ్వలేదు: బీసీసీఐ నిఘాలో కొత్తకోణం

Posted by:
Published: Wednesday, May 13, 2015, 12:22 [IST]

ముంబై: శ్రీనివాసన్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అధికారులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై కొత్త కోణం! శ్రీనివాసన్‌ నేతృత్వంలోని బీసీసీఐ ఎప్పుడూ తమ అధికారులపై నిఘా పెట్టలేదని, లలిత్‌ మోడీ బహిష్కరణ అనంతరం హ్యాకింగ్‌ సమస్యను ఎదుర్కొనేందుకు మాత్రమే కొన్ని చర్యలు చేపట్టిందని బోర్డు ఓ మాజీ అధికారి చెప్పాడు.

అధికారులపై ఎలాంటి నిఘా పెట్టలేదని సదరు మాజీ చెప్పాడు. 2013లో లలిత్ మోడీ హ్యాకింగ్ సమస్య పరిష్కారానికి, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సూచన మేరకు ఇంగ్లాండుకు చెందిన కంపెనీ (హ్యాకింగ్ నిరోధానికి) సేవలను బీసీసీఐ పొందిందని చెప్పాడు.

BCCI didn't snoop, only tried to stop hacking, says former official

అంతర్గత మెయిళ్లు పంపిన కొన్ని నిమిషాలలోపే అందులోని సమాచారం ట్విట్టర్లో వచ్చిన సందర్భాలున్నాయని, బీసీసీఐ మెయిళ్లను కాపాడేందుకు లండన్‌కు చెందిన సంస్థ సేవలను ఉపయోగించుకున్నా, అది గూఢచర్యం కాదని చెప్పాడు. లండన్ కంపెనీ సేవలు పొందేందుకు ఐదున్నర కోట్లు చెల్లించినట్లు వచ్చిన వార్తలను కూడా ఖండించాడు. కాగా, నిఘా ఆరోపణల పైన బీసీసీఐ విచారణ జరుపుతోంది.

English summary
BCCI didn't snoop, only tried to stop hacking, says former official
మీ వ్యాఖ్య రాయండి