Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

లారాను ఔట్ చేశాడు: అర్జున్‌కు వసీం చిట్కాలు

Posted by:
Published: Thursday, May 14, 2015, 11:58 [IST]

ముంబై: పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ వసీం అక్రమ్‌ బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌కు బౌలింగ్‌ చిట్కాలు చెబుతూ కనిపించాడు. గత వేసవిలో ఇం గ్లండ్‌లో అర్జున్‌ను కలుసుకున్నట్లు అక్రమ్‌ చెప్పాడు.

అక్కడ తాము ఎగ్జిబిషన్ గేమ్ ఆడామని, అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ చేస్తుండగా తాను మిడాన్‌లో నించున్నానని, అతను బ్రియాన్ లారాను అవుట్ చేశాడని వసీం అక్రమ్ చెప్పాడు. బుధవారంనాడు ఆయన ఆ విషయం చెప్పాడు.

మీడి యం పేసర్‌గా అతని యాక్షన్‌, స్వింగ్‌ గురించి సూచనలిచ్చినట్లు తెలిపాడు. సచిన్‌తో పోలిస్తే అర్జున్‌ విభిన్నంగా ఉన్నాడన్నాడు. బ్యాట్స్‌మన్‌గా కంటే బౌలర్‌గా కనిపిస్తున్నాడని చెప్పాడు.

 'Arjun Tendulkar got Brian Lara out in England'

అర్జున్ 15 ఏళ్ల పిల్లవాడని, ఎడమచేతి వాటం మీడియం పేసర్‌గా కృషి చేస్తున్నాడని, అతని యాక్షన్‌, స్వింగ్‌లపై తాను మాట్లాడానని, సహజంగానే అతని ఫిట్నెస్ అత్యంత కీలకమైందని వసీం అక్రమ్ అన్నాడు.

అర్జున్ స్పాంజీలాగా ఉన్నాడని, విద్యార్థిగా చాలా ఉత్సుకతతో ఉన్నాడని, అది చాలా మంచి విషయమని అన్నారు. ఐపియల్ 8 సీజన్‌లో వసీం అక్రమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్‌గా వ్యవహరిస్తుండగా, టెండూల్కర్ ముంబై ఇండియన్స్ ఐకాన్ ప్లేయర్‌గా వ్యవహరిస్తున్నాడు.

English summary
Former Pakistan captain and left arm pace great Wasim Akram was seen giving bowling tips to budding pacer, Arjun Tendulkar, at the Wankhede Stadium here.
మీ వ్యాఖ్య రాయండి