Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

పాక్‌తో సిరీస్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Posted by:
Published: Thursday, May 14, 2015, 15:59 [IST]

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో క్రికెట్ సిరీస్‌కు కేంద్రం అంగీకరించిందని సమాచారం. స్థానిక మీడియా కథనాల ప్రకారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యాన్ ఖాన్ కలిసి చర్చించిన అనంతరం ఈ సిరీస్‌కు సానుకూల వాతావరణం ఏర్పడిందని తెలుస్తోంది.

అనంతరం పాకిస్తాన్‌తో క్రికెట్ సిరీస్‌ను పునురుద్ధరించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్రం చెప్పిందని తెలుస్తోంది. షహర్యార్ చర్చలు విజయవంతమయ్యాయని స్థానిక మీడియా ప్రకటించింది.

 Government gives green signal to Indo-Pak cricket series: Sources

పాక్‌తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందనే వార్త విన్న తాను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నానని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పాడు. ఆ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నాడు. ఏ క్షణంలోనైనా కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నాడు.

English summary
Government gives green signal to Indo-Pak cricket series: Sources
మీ వ్యాఖ్య రాయండి