Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

‘భారత్‌కు ఉన్నది ఒకటే వాల్: అది ద్రావిడ్’

Published: Friday, May 15, 2015, 18:07 [IST]

ముంబై: తనపై ప్రశంసలు కురిపించిన టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌కు భారత ఆటగాడు అజింక్యా రహానే కృతజ్ఞతలు తెలిపాడు. అయితే తనను ‘ది వాల్'తో పోల్చవద్దని చెప్పాడు.

‘రాహుల్ భాయి నుంచి చాలా పెద్ద ప్రశంస ఇది. ఆయన మాటలతో ఎంతో స్ఫూర్తినిచ్చాయి. మరెంతో శ్రమించేలా చేశాయి. ఫలితం నాకు ముఖ్యం కాదు, ఆడటమే. గత రెండేళ్లుగా నేను చేస్తున్నది అదే' అని ఐపిఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ ప్రమోషన్ కార్యక్రమంలో రహానే తెలిపాడు.

‘గత ఏడాది కాలంగా టెస్టుల్లో రాణిస్తున్న భారత ఉత్తమ ఆటగాడు రహానే. గత సంవత్సరం టీమిండియా చేసిన నాలుగు విదేశీ పర్యటనల్లోనూ రహానే ఉత్తమంగా రాణించాడు' అని రాజస్థాన్ రాయల్స్ మెంటర్ ద్రావిడ్ తెలిపాడు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో రహానే సెంచరీలు నమోదు చేసిన విషయం తెలిసిందే.

‘అక్కడ ఒకటే వాల్ ఉంటుంది. ఎప్పుడూ ఒక్కటే. నేను ఆ స్థానాన్ని భర్తీ చేస్తానని అనుకోవడం లేదు. భారత్‌లో ఒకటే వాల్ ఉంది. అది రాహుల్ ద్రావిడ్' అని రహానే పేర్కొన్నాడు. ఇటీవల రహానే ప్రదర్శనను రాహుల్ ద్రావిడ్‌తో పోలుస్తున్న నేపథ్యంలో రహానే ఈ వ్యాఖ్యలు చేశాడు.

'There is only one Wall in India and that is Rahul Dravid'

‘టీ20ల్లో ఒకసారి నువ్వు గెలుస్తావ్. మరోసారి ఓడిపోతావ్. అయితే బాగా ఆడటమే ముఖ్యం. ఈ ఏడాదిలో మెరుగ్గా రాణిస్తున్నానని అనుకుంటున్నా' అని రహానే తెలిపాడు. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడే మ్యాచులో చావోరేవో తెలుస్తుందని అన్నాడు. తమ జట్టు సభ్యులందరూ బాగా ఆడుతున్నారని చెప్పిన రహానే, శనివారం నాటి మ్యాచులో కూడా అందరూ మెరుగ్గా రాణిస్తారని తెలిపాడు.

‘మేం ఫలితం కోసం చూడటం లేదు. మైదానంలో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం. నాకు నమ్మకం ముందు మేం క్వాలీఫై అవుతాం' అని రహానే చెప్పాడు. కోల్‌కతా జట్టు కూడా మెరుగ్గా రాణిస్తోందని, సమతుల్యంగా ఉందని తెలిపాడు.

English summary
India batsman Ajinkya Rahane today thanked former captain Rahul Dravid for the encomiums showered on him yesterday, but insisted he cannot be compared to "The Wall."
మీ వ్యాఖ్య రాయండి