Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బంగ్లా టూర్‌లో కోహ్లీకి రెస్టు!: టెస్ట్ ఆడమన్న సన్నీ

Published: Saturday, May 16, 2015, 12:50 [IST]

న్యూఢిల్లీ: జూన్ నెలలో బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా జట్టును సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్‌ ప్యానెల్‌ 20న ఎంపిక చేయనుంది. అయితే విరాట్‌ కోహ్లీతో పాటు పలువురు సీనియర్‌ ఆటగాళ్లు తమకు విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరినట్టు సమాచారం.

ఆస్ర్టేలియా పర్యటనలోనే ధోనీ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత నాలుగో టెస్ట్‌కు కోహ్లీ సారథ్యం వహించాడు. ఇక బంగ్లా టూర్‌కు కోహ్లీ దూరమైతే.. టెస్ట్‌ కెప్టెన్సీ ఎవరికి అప్పగిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఏకైక టెస్ట్‌ ఆడనుంది. ఫతుల్హా వేదికగా జూన్‌ 10-14 మధ్య టెస్ట్‌ నిర్వహించనున్నారు. ఇక మూడు వన్డేలకు (జూన్‌ 18, 21, 24) మిర్‌పూర్‌ ఆతిథ్యమివ్వనుంది.

కోహ్లీ టెస్టులో ఆడితే బెటర్‌

India likely to have new Test captain for Bangladesh tour

బంగ్లాతో జరిగే ఏకైక టెస్టుకు విరాట్‌ కోహ్లీ జట్టుకు నాయకత్వం వహించి.. అనంతరం జరిగే వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. బంగ్లా టూర్‌కు కోహ్లీకి విశ్రాంతి తీసుకోనున్నాడనే వార్తలు రావడంతో గవాస్కర్‌ స్పందించాడు.

‘సుమారు ఐదు నెలలుగా విపరీతమైన క్రికెట్‌ ఆడుతున్నందువల్ల విరాట్‌తో పాటు అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌లకు కూడా విశ్రాంతి ఇవ్వాల'ని సునీల్‌ సూచించాడు. పాక్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన జోరుమీదు న్న బంగ్లాను తక్కువగా అంచనా వేస్తే దెబ్బతినే అవకాశం ఉందన్నాడు. బంగ్లాను నిలువరించాలంటే పటిష్టమైన జట్టును పంపాలని సూచించాడు.

English summary
The Indian squad for next month's tour of Bangladesh is to be picked by the national cricket selection panel headed by Sandeep Patil here on May 20.
మీ వ్యాఖ్య రాయండి