Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వన్డే క్రికెట్‌కు ఆసీస్ కీపర్ బ్రాడ్ హాడిన్ గుడ్‌బై

Posted by:
Published: Sunday, May 17, 2015, 14:46 [IST]

సిడ్నీ: ఆస్టేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు గుడ్ బై పలుకుతున్నట్లు క్రికెట్ ఆస్టేలియా ప్రకటించింది. తన రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న బెంగుళూరులో వెల్లడించాడు.

37 సంవత్సరాల బ్రాడ్ హాడిన్ తన కెరీర్‌లో మొత్తం 126 వన్డే మ్యాచ్‌లు ఆడి 3,122 పరుగులు (31.53 సగటుతో) సాధించాడు. మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుత ఆస్టేలియా జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడు హాడిన్ మాత్రమే.

Australia's wicketkeeper Brad Haddin retires from ODIs

తన రిటైర్మెంట్ సందర్భంలో హాడిన్ మాట్లాడుతూ తాను ఎంతో కాలం పాటు వన్డే క్రికెట్‌ను ఆస్వాదించానని తెలిపాడు. తన జీవితంలో ఆట ఇక చాలునని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆస్టేలియా జట్టు ప్రపంచ నెంబర్ వన్‌గా ఉన్న తరుణంలో, తాను సభ్యునిగా ఉన్న జట్టు వరల్డ్ కప్ గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నాడు.

ఇలాంటి సమయంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి మంచి సమయం ఇంకేముంటుందని అన్నాడు. క్రికెట్ ఆస్టేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సుథర్లాండ్ మాట్లాడుతూ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బ్రాడ్ హాడిన్‌ని అభినందించారు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆస్టేలియా వికెట్ కీపర్‌గానే కాకుండా బ్యాట్స్‌మెన్‌‌గా కూడా అద్భుతంగా తన సేవలందించాడని కొనియాడారు. సోమవారం నుంచి వెస్టిండిస్‌తో ఆస్టేలియా టెస్టు సిరిస్‌ ప్రారంభం కానున్న సందర్భంలో బ్రాడ్ హాడిన్ తన రిటైర్మెంట్‌ను ప్రకటించడం విశేషం.

English summary
Australian wicketkeeper Brad Haddin has announced his retirement from one-day internationals, Cricket Australia said today.
మీ వ్యాఖ్య రాయండి